రాగిణి ఎంఎంఎస్ సినిమా మినహా.. ఆ తర్వాత మరోసారి లిప్ లాక్ జోలికి వెళ్లని సన్నీలియోన్.. ప్రస్తుతం కిస్సింగ్ సీన్ చేసేసింది. రాగిణి సినిమాకు తర్వాత కిస్సింగ్ చేయకూడదని సన్నీ లియోన్ డిసైడ్ చేసుకున్నట్లు బిటౌన్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. అయితే తాజాగా అవన్నీ ఉత్తుత్తివేనని సన్నీలియోన్ ఫ్రూఫ్ చేసింది. అబ్బే తానెప్పుడు కిస్సింగ్ సీన్లో నటించనని చెప్పాను. ఇదిగో కెమెరా ముందు కిస్సింగ్ సీన్ చేస్తున్నానని సన్నీ లియోన్ వెల్లడించింది.
అయితే ఈసారి లిప్ లాక్ చేసింది ఓ నటుడితోనో కాదు.. తన భర్త డానియల్. తన భర్తతో లిప్ కిస్ పెట్టుకుంటూ ఆ ఫోటోనో సోషల్ నెట్వర్క్‌లో షేర్ చేసింది సన్నీ లియోన్. అంతే కాదు.. మే 13 సన్నీలియోన్ పుట్టిన రోజు. 35వ ఏట అడుగుపెట్టిన ఈ సెక్సీ సుందరి తన భర్తతో లిప్ లాక్ చేసి ఆ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టడం చూసి ఫ్యాన్స్ ఖంగుతిన్నారు. అదన్నమాట.. సన్నీ కిస్ సంగతి!