Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంతకు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్

Webdunia
శనివారం, 19 మార్చి 2022 (19:02 IST)
Christopher Nolan, Samantha
కమర్షియల్ వేల్యూస్‌తో పాటు కంటెంట్ ఉన్న కథలకు సమంత ఓకే చెప్తున్నారు. ఇటు కమర్షియల్ వేల్యూస్, అటు కంటెంట్ ఉన్న కథతో శ్రీదేవి మూవీస్ ప్రొడక్షన్ హౌస్ ఆమెను అప్రోచ్ అవడంతో వెంటనే సినిమా ఓకే చేశారు. ఆ చిత్రమే 'యశోద'. సమంత ఇంతకు ముందు చేసిన ఫిమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్‌కు డిఫరెంట్ ఫిల్మ్ ఇది. ఇందులో యాక్షన్ పార్ట్ కూడా ఉంది. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ యానిక్ బెన్‌తో యాక్షన్ సీక్వెన్స్ తీశారు. 
 
'ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌కు యానిక్ బెన్ వర్క్ చేశారు. అందులో యాక్షన్ సీన్స్‌కు ఆయన డైరెక్షన్ చేశారు. సమంతతో 'యశోద' ఆయనకు సెకండ్ ప్రాజెక్ట్. హాలీవుడ్‌లో క్రిస్టోఫర్ నోలన్ సినిమాలకు స్టంట్ పర్ఫార్మర్‌గా కూడా ఆయన వర్క్ చేశారు. రీసెంట్‌గా హైద‌రాబాద్‌లో పది రోజుల పాటు 'యశోద' యాక్షన్ సీక్వెన్స్ తీశారు. ఇంకో యాక్షన్ సీక్వెన్స్ కొడైకెనాల్‌లో జరిగే షెడ్యూల్‌లో తీయాలని ప్లాన్ చేశారు. మూడు కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఆర్ట్ డైరెక్టర్ అశోక్ వేసిన సెట్స్‌లో ప్రజెంట్ షూటింగ్ చేస్తున్నారు. 
 
హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ యానిక్ బెన్ నేతృత్వంలో తీసిన యాక్షన్ సీక్వెన్స్ గురించి శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ "సమంత తదితరులపై పది రోజుల పాటు మూడు సెట్స్‌లో షూటింగ్ చేశాం. సమంత కష్టపడి అద్భుతంగా యాక్షన్ సీన్స్ చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే థ్రిల్లర్ చిత్రమిది" అని చెప్పారు. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్,  రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి హరి, హరీష్ దర్శకులు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments