Webdunia - Bharat's app for daily news and videos

Install App

"హాయ్ నాన్న" ఈవెంట్‌లో రష్మిక- విజయ్ ఫోటో.. సారీ చెప్పిన నాని

Webdunia
సోమవారం, 4 డిశెంబరు 2023 (11:12 IST)
Hi nanna
నేచురల్ స్టార్ నాని "హాయ్ నాన్న" త్వరలో విడుదల కాబోతుండగా, నాని ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ సంచలనం సృష్టిస్తున్నారు. అయితే, ఇటీవల జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఊహించని మలుపు తిరిగింది. ఇందులో విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న చిత్రాలను ప్రదర్శించడంపై విమర్శలు వచ్చాయి.
 
ఈ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న చిత్రాలను ప్రదర్శించారు. ఈ ఫోటోలో రష్మిక స్విమ్మింగ్ పూల్‌లో వుండగా విజయ్ మందుబాటిల్‌తో ఆమె పక్కనే వున్నాడు. ఈ ఫోటోను నాని సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చూపెట్టడం ఏంటని విమర్శలు వెల్లువెత్తాయి. 
 
ఈ వివాదానికి సంబంధించి ఇటీవలి ఇంటర్వ్యూలో, నాని క్షమాపణలు చెప్పాడు. "ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో, చాలా మంది వ్యక్తులు పాల్గొంటున్నారు. ఎవరైనా తమ ఉత్సాహంతో ఈ చిత్రాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది.
 
విజయ్- రష్మిక నాకు సన్నిహితులు, దీనిపై బాధపడరని నేను నమ్ముతున్నాను. అయితే, నేను హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నాను" అని నాని పేర్కొన్నాడు. డిసెంబర్ 7న విడుదల కానున్న హాయ్ నాన్నాలో నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments