Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వే నువ్వే సినిమాకు 20 ఏళ్లు.. తరుణ్ మాటలు.. త్రివిక్రమ్ కన్నీళ్లు

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2022 (16:24 IST)
ఒకప్పుడు లవర్ బాయ్ తరుణ్ హీరోగా నటించిన నువ్వే నువ్వే సినిమా 20 ఏళ్లు పూర్తిచేసుకుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను దర్శకునిగా పరిచయం చేస్తూ… ప్రముఖ నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ పతాకంపై "స్రవంతి" రవికిశోర్ నిర్మించారు. ఇందులో తరుణ్, శ్రియ జంటగా నటించగా.. ప్రకాశ్ రాజ్, చంద్ర మోహన్, సునీల్, రాజీవ్ కనకాల, తనికెళ్ళ భరణి కీలక పాత్రలు పోషించారు. 
 
సోమవారానికి విడుదలై 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏఎంబీస్‌లో స్పెషల్ షో వేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‏మీట్‏లో తరుణ్ మాట్లాడుతున్న సమయంలో త్రివిక్రమ్ ఎమోషనల్ అయ్యారు. స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్నారు.
 
ఈ సందర్భంగా తరుణ్ మాట్లాడుతూ.. "విడుదలై 20 ఏళ్ళు అయినా… ఫస్ట్ డే ఫస్ట్ షో చూసినట్టు ఉంది. నాకు బోర్ కొట్టినప్పుడు యూట్యూబ్‌లో చూస్తా. నన్ను నువ్వే కావాలితో రామోజీరావు గారు, స్రవంతి రవికిశోర్ గారు హీరోగా పరిచయం చేశారు. ఆ తర్వాత స్రవంతి మూవీస్ సంస్థలో ‘నువ్వే నువ్వే’, ‘ఎలా చెప్పను?’ చేశానని చెప్పారు. 
 
హీరోగా ‘నువ్వే కావాలి’కి త్రివిక్రమ్ మాటలు రాశారు. దర్శకుడిగా ఆయన తొలి సినిమాలో నేను హీరో కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఎంత మంది హీరోలతో చేసినా… ఆయన ఫస్ట్ హీరో నేనే. "నువ్వే నువ్వే" లాంటి ఇంకొకటి చేయమని చాలా మంది అడుగుతారు. నాకు ఇటువంటి చేసే అవకాశం ఇచ్చిన త్రివిక్రమ్ గారికి థాంక్స్. అమ్మ, ఆవకాయ్, అంజలి, నువ్వే నువ్వే…. ఎప్పటికీ బోర్ కొట్టవు" అని అన్నారు. అయితే తరుణ్ మాట్లాడుతున్న సమయంలో త్రివిక్రమ్ కన్నీళ్లు పెట్టుకున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments