Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎవరి బతుకు వాళ్లని బతకనివ్వండి.. మీడియాకు మంచు లక్ష్మి వినతి

Advertiesment
Manchu Lakshmi-, Kochi Beach
, ఆదివారం, 9 అక్టోబరు 2022 (14:52 IST)
తన సోదరుడు, హీరో మంచు మనోజ్ త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీటిపై ఆయన సోదరి, నటి మంచు లక్ష్మి స్పందించారు. ఎవరి బతుకు వాళ్లను బతకనివ్వండి అంటూ కామెంట్స్ చేశారు. 
 
మంచు లక్ష్మి శనివారం తన పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఓ చానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన సోదరుడి పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
 
'మనోజ్‌ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు. ఆయన త్వరలో పెళ్లి చేసుకోనున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏమిటి?' అని విలేకరి ప్రశ్నించగా.. 'ఎవరి బతుకు వాళ్లని బతకనివ్వండి. ఇప్పుడున్న రోజుల్లో నిస్వార్థమైన, నిజాయతీ కలిగిన ప్రేమను పొందడం చాలా కష్టం. మనోజ్‌ అలాంటి ప్రేమను పొందుతున్నదుకు నేనెంతో ఆనందిస్తున్నా. అతనికి ఎప్పుడూ నా ఆశీస్సులు ఉంటాయి' అని ఆమె వివరించారు.
 
అనంతరం, ఇటీవల జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో విష్ణు చేసిన కామెంట్స్‌పై ఆమె స్పందించారు. 'మా' అధ్యక్షుడయ్యాక తనపై ఎక్కువగా ప్రతికూల ప్రచారం జరిగిందని ఇటీవల విష్ణు అన్నారు. ఈ అంశంపై స్పందన కోరగా.. 'అవన్నీ పనికి రాని విషయాలు. ఒక రాజకీయ వ్యవస్థలో ఒకరు బాగున్నారంటే.. అతనిపై బురద జల్లడానికి మరొకరు సిద్ధంగా ఉంటారు. ఒక రంగంలోకి దిగాక మంచితోపాటు చెడును కూడా ఆహ్వానించాలి. సినీ పరిశ్రమలో హీరోలందరూ బాగానే ఉంటారు. 
 
కానీ, ఈ ఫ్యాన్స్‌ మాత్రం ఎందుకింతలా కొట్టుకుంటారో నాకు అర్థం కాదు. కొంతమంది మనుషులు ఎప్పుడూ ప్రతికూలంగానే ఆలోచిస్తారు. నువ్వు ఎంత మంచి చేసినా వాళ్లు చెడుగానే చూస్తుంటారు. నెగెటివిటీని ఆహ్వానించడానికి విష్ణుకు కాస్త సయమం పడుతుంది. అయినా, పర్వాలేదు. ప్రతీది మనకు ఒక పాఠం నేర్పిస్తుంది. ప్రతి అనుభవం నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి' అని ఆమె బదులిచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ కళ్లద్దాలు విజయ్ దేవరకొండవేనా? మాల్దీవుల్లో రష్మిక మందన్నా...