Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీరియాడిక్ యాక్షన్ తో దసరాకు సిద్దమైన హీరో సూర్య చిత్రం కంగువ

డీవీ
శనివారం, 29 జూన్ 2024 (08:56 IST)
kanguva date poster
స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ 'కంగువ' రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ మోస్ట్ అవేటెడ్ మూవీని అక్టోబర్ 10 దసరా పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. 'కంగువ' చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు.

దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 'కంగువ' సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు.
 
'కంగువ' నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన సిజిల్ టీజర్, పోస్టర్స్ సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి. పీరియాడిక్ యాక్షన్ జానర్ లో ఇప్పటిదాకా తెరపైకి రాని ఒక కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోబోతోందీ సినిమా. పది భాషల్లో తెరకెక్కుతున్న 'కంగువ' త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి వస్తున్న మరో బిగ్గెస్ట్ మూవీగా 'కంగువ' సినిమాపై అటు ట్రేడ్ వర్గాల్లో, ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.
 
నటీనటులు - సూర్య, దిశా పటాని, యోగి బాబు, బాబీ డియోల్ తదితరులు
 
టెక్నికల్ టీమ్  ఎడిటర్ – నిశాద్ యూసుఫ్,  సినిమాటోగ్రఫీ - వెట్రి పళనిస్వామి, యాక్షన్ – సుప్రీమ్ సుందర్, డైలాగ్స్ – మదన్ కార్కే,  కథ – శివ, ఆది నారాయణ, పాటలు – వివేక్, మదన్ కార్కే,  కాస్ట్యూమ్ డిజైనర్ – అను వర్థన్, దష్ట పిల్లై,  కాస్ట్యూమ్స్ – రాజన్,  కొరియోగ్రఫీ – శోభి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఏ జే రాజా, కో ప్రొడ్యూసర్ – నేహా జ్ఞానవేల్ రాజా, పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్) ప్రొడ్యూసర్స్ – కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్, దర్శకత్వం – శివ

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

యువతికి మత్తు ఇచ్చి మియాపూర్ రోడ్డుపై కదులుతున్న కారులో గ్యాంగ్ రేప్

ఏపీలో మళ్లీ ఉచిత ఇసుక విధానం.. అమలు ఎప్పటి నుంచంటే...

మాజీ సీఎం కేసీఆర్ షాక్.. కాంగ్రెస్ కండువా కప్పుకున్న కేకే!!

జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం - విచారణలో కదలిక...

నీ అంతు చూస్తా... ఎమ్మెల్యే కొండబాబుకి ద్వారంపూడి అనుచరుడు భళ్లా సూరి వార్నింగ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments