Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిస్మత్ ఫస్ట్ లుక్‌ విడుదలచేసిన హీరో సత్య దేవ్

Webdunia
సోమవారం, 9 అక్టోబరు 2023 (16:56 IST)
Kismath look
యూత్‌ఫుల్ ఫన్ ఫుల్ ఎంటర్‌టైనర్‌లు మోస్ట్ సక్సెస్ ఫుల్ సబ్జెక్ట్‌లు. కామ్రెడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ కలిసి మోస్ట్ ఎంటర్ టైనింగ్ బడ్డీ కామెడీ 'కిస్మత్‌'ను రూపొందిస్తున్నారు. శ్రీనాథ్ బాదినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, అవసరాల శ్రీనివాస్, విశ్వ దేవ్ బెస్ట్ బడ్డీలుగా కనిపించనుండగా, రియా సుమన్ హీరోయిన్.
 
ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని విడుదల చేయడం ద్వారా మేకర్స్ ప్రమోషన్స్‌ను ప్రారంభించారు.  హీరో సత్యదేవ్ ప్రధాన తారాగణాన్ని పరిచయం చేస్తూ పోస్టర్‌ను లాంచ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, అవసరాల శ్రీనివాస్, విశ్వ దేవ్, రియా సుమన్ ఎందుకో కలవరపడుతున్నట్లు కనిపించారు. బ్యాక్ గ్రౌండ్ లో కరెన్సీ నోట్లు ఉన్నాయి.
 
'కిస్మత్' అంటే అదృష్టం. ఫస్ట్ లుక్ పోస్టర్ ఇది ఫన్ రైడ్ గా సాగుతుందని భరోసా ఇస్తుంది. రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, సిహెచ్ భానుప్రసాద్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వేదరామన్ శంకరన్ డీవోపీగా పని చేస్తుండగా, మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్నారు. విప్లవ్ నైషధం ఎడిటర్.
 
కిస్మత్ షూటింగ్ మొత్తం పూర్తయింది. సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
 
తారాగణం: నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, అవసరాల శ్రీనివాస్, విశ్వ దేవ్, రియా సుమన్, అజయ్ ఘోష్, టెంపర్ వంశీ, చమ్మక్ చంద్ర, రచ్చ రవి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వెయిట్ అండ్ సీ అన్న ఉదయనిధి స్టాలిన్ - పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు

ధ్వజ స్తంభానికి వేలాడదీసే కొక్కెం విరిగిపోయింది.. అంతే.. టీటీడీ

పవన్‌ కల్యాణ్‌కు బీజేపీ రోడ్‌ మ్యాప్‌ ఇచ్చేసిందా?

భర్తే అత్యాచారం చేస్తే నేరమా? కాదా? - పార్లమెంటులోనే నిర్ణయిస్తామని కేంద్రం కోర్టుకు ఎందుకు చెప్పింది

లడ్డూ కల్తీ అయిందా.. ఎక్కడ? సిట్ ఎందుకు.. బిట్ ఎందుకు? జగన్ ప్రశ్న (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

తర్వాతి కథనం
Show comments