Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సాహో' తర్వాత ప్రభాస్ వ్యవసాయం చేయడట.. ప్రేమకథలో నటిస్తాడట...

యంగర్ రెబెల్ స్టార్ ప్రభాస్ "బాహుబలి" తర్వాత నటిస్తున్న చిత్రం "సాహో". ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరో నెల రోజుల పాటు ఈ సినిమా ష

Webdunia
సోమవారం, 25 జూన్ 2018 (16:48 IST)
యంగర్ రెబెల్ స్టార్ ప్రభాస్ "బాహుబలి" తర్వాత నటిస్తున్న చిత్రం "సాహో". ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరో నెల రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ 'అబుదాబి'లో జరుగనుంది. ఇదిలావుంటే, సాహో తర్వాత తదుపరి నటించేందుకు ఎలాంటి ప్రాజెక్టుకు ప్రభాస్ సంతకం చేయలేదు.
 
దీంతో 'సాహో' తర్వాత ఏం చేస్తారని ప్రభాస్‌ను మీడియా మిత్రులు ప్రశ్నించారు. దీనికి సమాధానమిస్తూ, ఈ చిత్రం షూటింగ్ తర్వాత ఏ వ్యాపారమో... వ్యవసాయమో చేసుకుంటానని చమత్కరించాడు. అయితే, సాహో షూటింగ్‌లో ఉండగానే ప్రభాస్ మరో చిత్రంలో నటించనున్నాడు. 
 
సాహో తర్వాత 'జిల్' మూవీ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. ఈ సినిమాను ప్రకటించిన దగ్గర నుంచి.. కథా వస్తువు ఏమై వుంటుందనే ఆసక్తి అందరిలోనూ పెరుగుతూ పోతోంది.
 
1970 నేపథ్యంలో సాగే ఒక ప్రేమకథగా ఈ సినిమా రూపొందనుందనేది తాజా సమాచారం. ప్రస్తుతం ఆ కాలానికి సంబంధించిన సామాజిక వాతావరణాన్ని ప్రతిబింభించే సెట్స్‌ను కళాదర్శకుడు రవీందర్ తీర్చిదిద్దుతున్నారట. 
 
లవ్.. యాక్షన్.. ఫాంటసీ కలగలిసిన ఈ సినిమా చిత్రీకరణ కొంతభాగం యూరప్‌లో జరగనున్నట్టు సమాచారం. పూజా హెగ్డే కథానాయికగా నటించే ఈ సినిమా రెగ్యులర్ షూటింగును ఆగస్టులో మొదలుకానుందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. విజయవాడ మెట్రోకు టెండర్లు

ఉప్పల్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. 25ఏళ్ల వ్యక్తి మృతి.. ఆయన ఎవరు? (Video)

పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది మన దేశ ఉగ్రవాదులా? చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాదులో రేవ్ పార్టీని చేధించిన EAGLE.. తొమ్మిది మంది అరెస్ట్

Jagan: సెంట్రల్ జైలుకు వెళ్లనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎందుకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments