షూటింగులో గాయపడిన హీరో ప్రభాస్!

ఠాగూర్
సోమవారం, 16 డిశెంబరు 2024 (16:08 IST)
టాలీవుడ్ హీరో ప్రభాస్ షూటింగులో గాయపడ్డారు. ఆయనకు చీలమండ బెణికిందని ప్రభాస్ వెల్లడించారు. దీంతో "కల్కి" ప్రమోషన్స్‌‌కు తాను హాజరుకావడం లేదని చెప్పినట్టు సమాచారం. ఓ సినిమా చిత్రీకరణ సందర్భంగా, ఓ సీన్ షూట్ చేస్తున్న సమయంలో తన చీలమండ బెణికిందని ప్రభాస్ వెల్లడించారు. 
 
తాను నటించిన 'కల్కి 2898ఏడీ' చిత్రం జపాన్‌లో జనవరి 3వ తేదీన విడుదలకానుంది. అయితే, గాయం కారణంగా తాను ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని క్లారిటీ ఇచ్చారు. గాయం కారణంగా వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని తెలిపారు. ప్రమోషన్ ఈవెంట్స్‌లో డిస్ట్రిబ్యూటర్ల బృందం పాల్గొంటుందని తెలిపారు. 
 
మరోవైపు, ప్రభాస్ గాయంపై ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ ఆరాధ్య హీరో త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. కాగా, 'కల్కి' చిత్రం తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన గణనీయమైన స్థాయిలో వసూళ్లు రాబట్టడం తెలిసిందే. ప్రభాస్‌కు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఇపుడీ చిత్రాన్ని జపాన్‌లోనూ విడుదల చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ambassador Car: పాత అంబాసిడర్ కారు పక్కన ఫోజులిచ్చిన చంద్రబాబు.. ఫోటోలు వైరల్ (video)

Anchor Shyamala: కర్నూలు బస్సు ప్రమాదం: 27 మంది వైఎస్‌ఆర్‌సిపి సభ్యులపై కేసు

AP: శ్రీశైలం నుండి విద్యుత్ కోసం తెలంగాణ వాటర్ తీసుకోవద్దు.. ఏపీ విజ్ఞప్తి

Krishna Water: సముద్రంలోకి 4.32 లక్షల క్యూసెక్కుల కృష్ణానది జలాలు

kasibugga stampede ఆ ఆలయం పండా అనే వ్యక్తి నిర్వహిస్తున్నారు: ఆనం రామనారాయణ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments