Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో నానికి బాకీ పడిన చిరంజీవి... అప్పటి నుంచి బాకీ తీర్చలేదట...

నేచురల్ స్టార్ నానికి మెగాస్టార్ చిరంజీవి బాకీ పడ్డారు. అదీ కూడా చిరంజీవి మాస్టర్ చిత్రం విడుదలైనప్పటి నుంచి ఈ బాకీని తీర్చలేదట. ఆ బాకీ ఇప్పటికైనా తీర్చాలని నాని గట్టిగా డిమాండ్ చేశాడు. దీంతో నాని పోడ

Webdunia
సోమవారం, 10 ఏప్రియల్ 2017 (11:48 IST)
నేచురల్ స్టార్ నానికి మెగాస్టార్ చిరంజీవి బాకీ పడ్డారు. అదీ కూడా చిరంజీవి మాస్టర్ చిత్రం విడుదలైనప్పటి నుంచి ఈ బాకీని తీర్చలేదట. ఆ బాకీ ఇప్పటికైనా తీర్చాలని నాని గట్టిగా డిమాండ్ చేశాడు. దీంతో నాని పోడు భరించలేక.. ఆ బాకీ తీర్చేందుకు చిరంజీవి సమ్మతించాడు. ఇంతకీ నానికి చిరంజీవి బాకీ ఎందుకు పడ్డాడో తెలుసుకుందాం.
 
స్టార్ మాటీవీలో చిరంజీవి యాంకర్‌గా 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమం ప్రసారమవుతున్న విషయం తెల్సిందే. ఈ కార్యక్రమానికి హీరో నాని హాజరయ్యాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... చిరంజీవి స్ఫూర్తితోనే కష్టపడి పైకొచ్చానని చెప్పాడు. అలాగే చిరంజీవి తనకొక సైకిల్‌ బాకీ ఉన్నారని, అది తనకు ఇప్పుడు ఇవ్వాలని అడిగాడు.
 
'నేను చదువుకునే రోజుల్లో మా ఇంట్లో వాళ్లు నాకు ఓ సైకిల్‌ కొనిచ్చారు. ఆ సైకిల్‌ వేసుకుని అమీర్‌పేట్‌ సత్యం థియేటర్‌లో అప్పుడే విడుదలైన ‘మాస్టర్‌’ సినిమాకు వెళ్లాను. థియేటర్‌ ఖాళీగా లేకపోవడంతో టిక్కెట్ల కౌంటర్‌లోకి ఎలాగోలా దూరిపోయి ఓ టిక్కెట్‌ సంపాదించాను. తీరా బయటకు వచ్చి చూస్తే నా సైకిల్‌ లేదు. అయినా సైకిల్‌ గురించి బాధపడకుండా టిక్కెట్‌ దొరికిందన్న ఆనందంలో సినిమాకు వెళ్లిపోయా. సినిమా అయిపోయిన తర్వాత గుర్తొచ్చింది సైకిల్‌ పోయిందని. అప్పుడు ఏడుపు మొదలైంది. ఆ సమయానికి ఇంట్లో వాళ్ళకు సర్దిచెప్పాను. 
 
ఇటీవల తాను నటించిన ‘భలే భలే మగాడివోయ్‌’ సినిమా చేసినపుడు నిర్మాత అరవింద్‌ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లా. ఆయన ఖచ్చితంగా నాకు సైకిల్‌ ఇస్తానని చెప్పారు. కానీ, ఇప్పటివరకు ఇవ్వలేదు. కాబట్టి, చిరంజీవిగారు మీరు నాకు సైకిల్‌ ఇవ్వండి’ అని నాని అడిగాడు. దానికి స్పందించిన చిరంజీవి.. తప్పకుండా సైకిల్‌ కొనిస్తానని, అది తనకు ఎంతో ఆనందమని జవాబిచ్చాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం మూడో దేశం జోక్యం అవసరం : టర్కీ అధ్యక్షుడు

స్పాట్‌లో ముగ్గురు - ఆస్పత్రిలో 14 మంది : గుల్జర్ హౌస్ ప్రమాదంపై మంత్రి పొన్నం (Video)

టీడీపీ కార్యకర్తపై దాడి : వైకాపా మాజీ ఎంపీ నదింగం సురేశ్ అరెస్టు

సికింద్రాబాద్ రైల్వే స్టేషనులో పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ హంగామా (Video)

గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ నిప్పులు వర్షం - 66 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments