Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీజే చిత్ర భర్త అరెస్ట్.. సీరియల్‌లో శోభనం సన్నివేశాలు.. అందుకే గొడవ.. ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 15 డిశెంబరు 2020 (10:38 IST)
VJ Chitra
బుల్లితెర నటి వీజే చిత్ర భర్త హేమనాథ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళ విజయ్ టీవీలో ప్రసారమయ్యే పాండియన్ స్టోర్స్ సీరియల్‌లో శోభనానికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించడం జరిగింది. సీరియల్‌లోని ఇలాంటి కొన్ని దృశ్యాల వల్ల భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని, అదే ఆమె ఆత్మహత్యకు దారితీసినట్లు వెల్లడించారు.

టీవీలో చిత్ర నటించిన పలు సీన్ల గురించి హేమనాథ్‌ అభ్యంతరం తెలిపాడు. ఈ కారణంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని.. ఒత్తిడి, వేధింపుల కారణంగానే వీజే చిత్ర ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. చిత్రను అతడు నెట్టివేయడంతో తీవ్ర వేదనకు గురైందని ఆ బాధతోనే ఆత్మహత్యకు పాల్పడిందని అధికారులు చెప్తున్నారు.
 
కాగా ఓ ప్రైవేట్‌ చానెల్‌లో ప్రజెంటర్‌గా కెరీర్‌ ఆరంభించిన చిత్ర ''పాండ్యన్‌ స్టోర్స్"" సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ముల్లై అనే  పేరుతో ఆమె పోషించిన పాత్ర ప్రేక్షకుల మదిని దోచుకుంది. అయితే ఇంతలో హేమనాథ్‌ ఆమె జీవితంలో ప్రవేశించాడు. పెద్దల అంగీకారంతో వీరిద్దరికి నిశ్చితార్థం జరిగింది. అయితే ముహుర్తానికి ముందే వీరు తమ రిజిస్టర్‌ మ్యారేజీ చేసుకున్నారు.
 
ఈ క్రమంలో డిసెంబరు 10న తన షూటింగ్‌ అనంతరం భర్తతో కలిసి ఓ హోటల్‌కు చేరుకున్న చిత్ర తన గదిలో ఉరికి వేలాడుతూ కనిపించారు. దీంతో హేమనాథ్‌ తమ కూతురిని కొట్టి చిత్రహింసలకు గురిచేసి చంపేశాడని ఆమె తల్లి ఆరోపించారు. ఇదిలా ఉండగా.. పోస్టుమార్టం నివేదికలో చిత్రది ఆత్మహత్యే అని తేలింది. ఈ క్రమంలో చిత్ర బలవన్మరణానికి పాల్పడేలా ప్రేరేపించిన ఆమె భర్తను పోలీసులు అరెస్టు చేశారు. హేమంత్‌ను 306 సెక్షన్ కింద అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను మట్టుబెట్టిన తమ్ముడు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments