Webdunia - Bharat's app for daily news and videos

Install App

హేమచంద్ర-శ్రావణ భార్గవి విడాకులు తీసుకుంటారా?

Webdunia
శనివారం, 25 జూన్ 2022 (09:59 IST)
Hemachandra-Bhargavi
టాలీవుడ్ టాప్ సింగర్‌లలో ఒకరైన హేమచంద్ర మహిళా సింగర్ అయిన శ్రావణ భార్గవిని ప్రేమించి 2013 ఫిబ్రవరి 14న వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి ప్రేమకు గుర్తుగా ఒక పాప కూడా పుట్టింది. 
 
అయితే ప్రస్తుతం వీరిద్దరూ విడిపోతున్నట్లు ఫిలిం సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు రావడంతో గత కొన్ని రోజులుగా విడివిడిగా ఉంటున్నారట. అయితే తాజాగా వీరిద్దరూ విడిపోయి విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నారట.
 
ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్న వీళ్లిద్దరు విడిపోవడం ఏంటని అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. వీరిద్దరూ కలిసి అంతకుముందు పాటల పోటీల్లో పాల్గొన్నారు. ఆ సమయంలోనే వీరి మధ్య కాస్త పరిచయం ఏర్పడింది. 
 
పరిచయం ముదిరి ప్రేమగా మారింది. అది పెళ్లి వరకు దారి తీసింది.హేమచంద్ర ఆ తర్వాత ప్లే బ్యాక్ సింగర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా పని చేస్తున్నారు. శ్రావణ భార్గవి కూడా సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
 
అయితే బుల్లితెర మీద వచ్చే చాలా షోలకి హాజరై ఈ కపుల్ సందడి చేస్తూ ఉంటుంది. టాలీవుడ్‌లో ఈ జంటను చూసిన వాళ్ళు అందరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ కాంప్లిమెంట్ ఇస్తూ ఉంటారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఒక్కసారిగా విడిపోతున్నారు అని వార్తలు బయటకు వచ్చేసరికి చాలామంది నమ్మలేకపోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments