Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాంగ్‌స్టర్ గంగరాజు ఎలా ఉందంటే?

Webdunia
శుక్రవారం, 24 జూన్ 2022 (21:04 IST)
Gangster Gangaraju
నటీనటులు: లక్ష్ చదలవాడ, వేదిక ద‌త్త‌, వెన్నెల కిషోర్‌, చ‌ర‌ణ్ దీప్‌, శ్రీకాంత్ అయ్యంగార్, గోప‌రాజు ర‌మ‌ణ‌, నిహార్ క‌పూర్‌, రాజేశ్వ‌రి నాయ‌ర్‌, స‌త్య‌కృష్ణ‌, ర‌వితేజ‌ న‌న్నిమాల‌, స‌మ్మెట గాంధీ, రాజేంద్ర‌, అను మాన‌స‌, లావ‌ణ్య రెడ్డి, అన్న‌పూర్ణ త‌దిత‌రులు
సాంకేతిక‌త‌- సినిమాటోగ్ర‌ఫీ: క‌ణ్ణ పి.సి., 
ద‌ర్శ‌క‌త్వం: ఇషాన్ సూర్య‌, ఎడిట‌ర్‌: అనుగోజు రేణుకా బాబు, సంగీతం: సాయి కార్తీక్‌, ఫైట్స్‌: డ్రాగ‌న్ ప్ర‌కాశ్‌,  కొరియోగ్రాఫ‌ర్స్‌: భాను, అనీష్‌, నిర్మాణం: శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్.
 
క‌రోనా త‌ర్వాత తెలుగు సినిమాలు ఎక్క‌వగా విడుద‌ల‌కావ‌డం ఈ వారం విశిష్ట‌త‌. దాదాపు ఏడు సినిమాలు విడుద‌ల‌య్యాయి. అందులో గ్యాంగ్‌స్టర్ గంగరాజు ఒక‌టి. చదలవాడ కృష్ణమూర్తి కుటుంబం నుంచి వ‌చ్చిన లక్ష్. ఇంత‌కుముందు వ‌ల‌యం సినిమాచేసిన లక్ష్ఈసారి గ్యాంగ్‌స్ట‌ర్ క‌థతో వ‌చ్చాడు. సీనియ‌ర్ ద‌ర్శ‌కుల వ‌ద్ద ప‌నిచేసిన ఇషాన్ సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మ‌రి ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
క‌థ‌-
అది దేవ‌ర్లంక గ్రామం. త‌ల్లిచ‌నిపోవ‌డంతో తండ్రి సంర‌క్ష‌ణ‌లో గారాబంగా పెరుగుతాడు గంగరాజు (లక్ష్). దాంతో ఓ బాధ్య‌త‌లేకుండా అల్ల‌రి చిల్ల‌రిగా తిరుగుతాడు. తండ్రి రైల్వే ఉద్యోగం. తండ్రి  రిటైర్మెంట్ రోజు హాయిగా స‌న్మానం పొందిన ఆయ‌న ఆ ఊరిలోని  సిద్దప్ప అనే గ్యాంగ్‌స్టర్ చేతిలో తీవ్ర అవ‌మానానికి లోన‌వుతాడు. త‌న క‌ళ్ళెదుటే తండ్రి అవ‌మానాన్ని జీర్ణించుకోలేని లక్ష్ గ్యాంగ్‌స్ట‌ర్‌కు బుద్ధి చెప్పాల‌ని నిర్ణ‌యించుకుంటాడు.. ఆ క్ర‌మంలో అనుకోని పరిస్థితుల్లో సిద్దప్ప హత్య లక్ష్ మీద పడటంతో గంగరాజు గ్యాంగ్‌స్టర్‌గా మారుతాడు. ఆ త‌ర్వాత ఏమ‌యింది? క‌థ ఏమ‌లుపు తిరిగింది? అనేది క‌థ‌. ఇందులో హీరోయిన్ పాత్ర ఏమిటి అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 
 
విశ్లేష‌ణ‌-
సాఫ్ట్ హీరోగా కాకుండా మాస్‌తో న‌త‌కంటూ ఓ ముద్ర కోసం ల‌క్ష్ చేసిన ప్ర‌య‌త్న‌మే ఈ సినిమా. ఆరు అడుగుల ఎత్తు వున్న ఆయ‌న‌కు అత‌కంటే ఎత్తువున్న జ‌య‌సుధ కుమారుడు కూడా ఇందులో న‌టించ‌డంతో గ్యాంగ్‌స్ట‌ర్లో హీరోనుమించి హైట్ వుండ‌డంతో కొత్త‌గా అనిపిస్తుంది. యాక్ష‌న్ స‌న్నివేశాలు యాక్ష‌న్ ఇష్ట‌ప‌డేవారికి న‌చ్చుతాయి. ద‌ర్శ‌కుడు ఇషాన్ కొత్త ద‌ర్శ‌కుడు అయినా వినూత్నంగా చెప్పాల‌నే ప్ర‌య‌త్నంలో కొన్ని మ‌లుపుల‌తో స్క్రీన్ ప్లే ఆక‌ర్ష‌ణీయంగా చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. ఫైట్స్, పాటలతో ల‌క్ష‌ ఆకట్టుకొన్నాడు. మాస్ గెటప్‌తో మంచి అనుభవం ఉన్న నటుడిగా తన పాత్రలో ఒదిగిపోయాడు. ఈజీగా పాత్ర‌ను పోషించాడు. ఎమోషనల్ సీన్లలో, రొమాంటిక్ సీన్లలో మంచి ఫెర్ఫార్మెన్స్ కనబరిచాడు.
ఇక   వెన్నెల కిషోర్ తనదైన మార్కును ప్రదర్శించాడు. బసిరెడ్డిగా చరణ్ దీప్ మెయిన్ విలన్ పాత్రలో మెరిసారు. హీరో తండ్రిగా గోపరాజు రమణ ఎమోషన్స్ పండించాడు.  హీరోయిన్ వేదిక దత్త ఇన్స్‌పెక్టర్‌గా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో మెరిసింది. శ్రీకాంత్ అయ్యంగార్ ఫన్‌తో కూడిన విలనిజాన్ని పండించారు. మిగితా క్యారెక్టర్లలో నటించిన వారందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు
 
టెక్నికల్ గా . కణ్ణ సినిమాటోగ్రఫి బాగుంది. సాయి కార్తీక్ మ్యూజిక్, పాటలు సన్నివేశాలను ఎలివేట్ చేశాయి. డ్రాగన్ ప్రకాశ్ డిజైన్ చేసిన ఫైట్స్‌ మాస్‌గా ఉన్నాయి. రేణుకా బాబు ఎడిటింగ్ బాగుంది. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ అనుసరించిన నిర్మాణ విలువలు వల్ల సినిమా చాలా రిచ్‌గా, క్లాస్‌గా ఉంది.
 
ఇది సాధార‌ణ క‌థే అయినా దాన్ని మ‌ల‌చ‌డంలో ఆస‌క్తిగా ద‌ర్శ‌కుడు చేశాడు. ఇక హీరో ప‌డిన క‌ష్టానికి ఈ చిత్రం నిద‌ర్శ‌నం. అయితే ఇంకాస్త మాడ్యులేష‌న్‌తోపాటు హావ‌భావాల‌ను మెరుగుప‌ర్చుకోవాలి. మాస్ హీరోగా రాణించే ల‌క్ష‌ణాలు వున్నాయి. మొత్తంగా ఈ సినిమా  ఎమోషన్స్, లవ్, రొమాంటిక్, యాక్షన్ అంశాలు కలబోసిన మాస్ ఎంటర్‌టైనర్ గా రూపొందింది. మాస్ చిత్రాలు మెచ్చే వారికి ఈ చిత్రం అల‌రిస్తుంది. 
రేటింగ్‌-3/5
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

16 యేళ్లలోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిందే...

ఢిల్లీలో పవన్ కళ్యాణ్ 'తుఫాన్' - నేడు ప్రధాని మోడీతో భేటీ!!

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments