Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండె పగిలిపోయినంత బాధ కలుగుతోంది: రష్మిక మందన్న (video)

Webdunia
గురువారం, 10 నవంబరు 2022 (08:07 IST)
Rashmika Mandanna
ఈ మధ్య రష్మిక మందన్న పై రకరకాలుగా వార్తలు వస్తున్నాయి. విజయ్ దేవర కొండతో గడిపిన ఫొటోస్ సోషల్‌ మీడియాలో హల్ చల్ చేశాయి. ఇంకా పలు విషయాలు జరిగాయి. అందుకే చాలాకాలంగా తనపై సోషల్‌ మీడియా వేదికగా వివిధ అంశాలపై విమర్శలు వస్తున్నాయి. వాటికి సమాధానంగా రష్మిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సుదీర్ఘమైన పోస్ట్‌ని షేర్‌ చేసింది. అందుకు సింబాలీక్ గా నీటిలో బోట్ లో కూర్చొని ఏటో చూస్తున్న ఫోటో కూడా పెట్టింది.
 
'గత కొన్ని రోజులుగా లేదా వారాలు, నెలలు, కొన్ని సంవత్సరాలుగా రెండు విషయాలు నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాయి. వాటికి నేను సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తున్నాను. నేను నా కోసం మాత్రమే మాట్లాడుతున్నాను. నిజానికి ఇది కొన్ని సంవత్సరాల క్రితమే చేయాల్సింది. నా కెరీర్‌ని ప్రారంభించినప్పటి నుంచి చాలామంది నన్ను ద్వేషిస్తున్నారు. విమర్శలు, నెగటివిటీతో ఇబ్బంది పెడుతున్నారు. నేను ఎంచుకున్న జీవితం ప్రత్యేకమైందని నాకు తెలుసు. నేను అందరికీ నచ్చాల్సిన పని లేదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ అందరూ ఇష్టపడతారని నేను కచ్చితంగా అనుకోను. నేను మీకు నచ్చలేదంటే దానర్థం.. మీరు నాపై విమర్శలు చేయొచ్చని కాదు.

నేను మాట్లాడని విషయాల గురించి నాపై విమర్శలు చేయడం నన్ను చాలా నిరుత్సాహపరుస్తుంది. అవి విన్నప్పుడు గుండె పగిలిపోయినంత బాధ కలుగుతోంది. చాలా కాలంగా దాన్ని పట్టించుకోకుండా ఉండిపోయాను. కానీ పరిస్థితి మరింత దిగజారిపోయింది. ఈ విషయాన్ని ఎత్తి చూపడం ద్వారా.. నేను ఎవరిపై గెలవడానికి ప్రయత్నించడం లేదు. నాపై వస్తున్న విమర్శల కారణంగా మనిషిగా నాలో ఎటువంటి మార్పు రావాలని కోరుకోవడం లేదు. మీ నిరంతర ప్రేమ, మద్దతు నన్ను ముందుకు నడిపించింది. అదే ఇంత ధైర్యాన్ని ఇచ్చింది' అని తెలిపింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments