Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆయ‌న స్టార్ అన్నట్టు బిహేవ్ చేయరు- చిరంజీవిగారు గుడ్ లక్ అన్నారు - హీరో కార్తికేయ

Webdunia
మంగళవారం, 9 నవంబరు 2021 (18:43 IST)
Karthikeya
కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ తాజా సినిమా  'రాజా విక్ర‌మార్క‌. ఇందులో ఎన్ఐఏ ఏజెంట్‌గా న‌టిస్తున్నారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా, తాన్యా రవిచంద్రన్ కథానాయికగా పరిచయమవుతున్నారు. ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందించారు. సినిమా విడుద‌ల సంద‌ర్భంగా  కార్తికేయ చెప్పిన విశేషాలు.
 
- నేను ఇప్పటివరకూ ఇంత కామెడీ టైమింగ్ ఉన్న క్యారెక్టర్ చేయలేదు. ఇందులో యాక్షన్ కూడా స్ట‌యిలిష్‌గా ఉంటుంది.ఎన్ఐఏ ఏజెంట్‌గా డ్ర‌స్సింగ్ కూడా క్లాసీగా ఉంటుంది. ఇప్పటివరకూ నేను టచ్ చేయని జానర్ సినిమా. రెండున్నర గంటలు కొత్త ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. తర్వాత ఏం జరుగుతుంది? అనే ఉత్కంఠతో ఆటు వినోదం కూడా ఉంటుంది. ప్రతి పాత్ర, వినోదం కథలో భాగం గానే ఉంటుంది. మా '88' రామారెడ్డి, ఆదిరెడ్డిగారితో ఫస్ట్ టైమ్ వర్క్ చేశా. వాళ్లకు తొలి సినిమా అయినా ఖర్చుకు వెనుకాడలేదు. రెండు కరోనా వేవ్స్ వచ్చినా... థియేటర్లలో రిలీజ్ చేయాలని పట్టుదలతో ఉన్నారు. వాళ్లు ఇచ్చిన మద్దతు గురించి ఎంత చెప్పినా తక్కువే.
 
- ఎన్ఐఏ ఏజెంట్ అంటే... బోర్డ‌ర్‌లో జ‌రిగే క‌థ కాదు. దేశం లోపల జరిగే కథ. దర్శకుడితో కూర్చుని చేసిన డిస్కషన్స్ ఎక్కువ. కామెడీ టైమింగ్, యాక్షన్ సీన్స్, డైలాగ్ డెలివరీ... అన్నీ డిస్కస్ చేశా. గన్ ఎలా పట్టుకోవాలి? వంటి విషయాల్లో రీసెర్చ్ చేశా.
 
- ద‌ర్శ‌కుడు శ్రీ ముందు ఏదో టైటిల్ చెప్పాడు. ఒక రోజు అతని ఫోనులో ఈ టైటిల్ చూశా. బావుందని ఫీలయ్యా. 'రాజా విక్రమార్క' టైటిల్ సౌండింగ్ లో ఒక స్ట్రెంగ్త్ ఉంది. ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. పాజిటివిటీ... చిరంజీవిగారి టైటిల్ పెట్టుకునే ఛాన్స్ ఉంది. దర్శకుడికి చెప్పిన తర్వాత ఒక రోజు టైమ్ తీసుకుని సరే అన్నాడు. 
 
- టైటిల్ పెట్టిన తర్వాత చెప్పాను. ముందు టైటిల్ దొరుకుతుందో? లేదో? అని చెక్ చేశాం. టైటిల్ ఉందని తెలిశాక రిజిస్టర్ చేశా. తర్వాత ఆయనకు పంపించాను. 'గుడ్ లక్' అని చెప్పారు. మెగాస్టార్ అభిమానిగా ఆయన టైటిల్ నా సినిమాకు పెట్టుకున్నానని ఒక సంతోషం. ఆయన సినిమా టైటిల్స్ అన్నీ ఆయనవే. కొంతమంది అభిమానులు పిల్లలకు తమ అభిమాన హీరో పేరు పెట్టుకుంటారు. అలా అభిమానంతో పెట్టుకున్నాను.   
 
- తమిళ సినిమా 'వాలిమై'లో విల‌న్‌గా చేస్తున్నా. ఫ‌స్ట్ డే అజిత్ గారితో నా కాంబినేష‌న్ సీన్స్ లేవు. నార్మల్ షూట్ చేశారు. సెకండ్ డే అజిత్ గారితో సీన్స్ తీశారు. ఆయన్ను కలిసే ముందువరకూ కొంచెం టెన్షన్ ఉంది. నాకు తెలియని లాంగ్వేజ్. ఆయన పెద్ద స్టార్. ఎలా ఉండాలో, ఏంటో? అని. ఆయన్ను కలిసిన ఒక నిమిషంలో చాలా  కంఫ‌ర్ట‌బుల్‌గా ఉండొచ్చ‌నే వైబ్ ఇచ్చేశారు. సెట్‌లో జూనియ‌ర్ ఆర్టిస్ట్ నుంచి అందరూ కంఫ‌ర్ట‌బుల్‌గా ఉండేలా చూస్తారు. స్టార్ అన్నట్టు బిహేవ్ చేయరు. దాంతో నేను ఈజీగా నటించా. ఈ సినిమా కోసం తమిళ్ కొంత నేర్చుకున్నాను
 
-  'రాజా విక్రమార్క'లో సిక్స్ ప్యాక్ లేవు. ప్రస్తుతానికి అయితే గన్స్, యాక్షన్! సిక్స్ ప్యాక్ గురించి చూద్దాం. ఇప్పుడే అయితే నేను ఏమీ చెప్పను. సిక్స్ ప్యాక్ చూపించానో? లేదో? సినిమాలో చూడాలి.  
 
- ప్రస్తుతం యువి క్రియేషన్స్ సంస్థలో ఒక సినిమా చేస్తున్నాను. తర్వాత క్లాక్స్ అని అబ్బాయి డైరెక్ట్ చేస్తున్న సినిమాలో నటిస్తున్నాను. శివలెంక కృష్ణప్రసాద్ గారి శ్రీదేవి మూవీస్ సంస్థలో ఓ సినిమా ఓకే అయ్యింది. అన్నీ డిఫరెంట్ జానర్ సినిమాలు. 'వాలిమై' సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. అందులో నటించడం వల్ల తమిళం నుంచి అవకాశాలు వస్తున్నాయి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రి-వెడ్డింగ్ షూట్, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం టపాసులు పేల్చితే... (video)

బెంగళూరులో యువతిపై నడిరోడ్డుపై లైంగిక వేధింపులు.. అక్కడ తాకి అనుచిత ప్రవర్తన

మనిషిలా మాట్లాడుతున్న కాకి.. వీడియో వైరల్

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments