Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవుళ్లను అద్బుతంగా చిత్రించడంలో గురువునే మించిపోయిన రాజమౌళి దైవ వ్యతిరేకా?

మనుషుల మధ్య మానసిక ఘర్షణలను, భావోద్వేగాలను అద్భుతంగా తెరకెక్కిచడంలో శిఖర స్థాయికి చేరుకున్న రాజమౌళి తన గురువు రాఘవేంద్రరావు తర్వాత దేవుళ్లకు సంబంధించిన సన్నివేశాలను తీయడంతో తనకు పోటీలేదనిపించుకున్నాడు

Webdunia
శనివారం, 29 ఏప్రియల్ 2017 (03:07 IST)
మనుషుల మధ్య మానసిక ఘర్షణలను, భావోద్వేగాలను అద్భుతంగా తెరకెక్కిచడంలో శిఖర స్థాయికి చేరుకున్న రాజమౌళి తన గురువు రాఘవేంద్రరావు తర్వాత దేవుళ్లకు సంబంధించిన సన్నివేశాలను తీయడంతో తనకు పోటీలేదనిపించుకున్నాడు. బాహుబలి ది బిగినింగ్‌లో శివుడి పాత్రధారి ప్రభాస్ విశ్వరూపాన్ని ఎలివేట్ చేయడంతో భాగంగా తీసిన ఎవడంట ఎవడంటా పాట ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని నోట మాట రాకుండా చేసింది. రాజమౌళి తప్ప మరొకరు అలాంటి దృశ్యాన్ని చేయలేరనే చిరకీర్తి తన పేరుతో దఖలు పడిపోయింది. 
 
కానీ తన సినిమాల్లో ఏదో ఒక సీన్‌లో దేవుడిని చూపించడంలో దేశంలోనే తనను మించిన దర్శకుడు లేడని నిరూపించుకున్న  రాజమౌళి స్వతహాగా నాస్తికుడట. దేవుడంటే నమ్మకం లేదట. తాను నాస్తికుడిగా మారడానికి  తన బంధువు గుణ్ణం గంగరాజు కారణం అంటున్నాడు రాజమౌళి.
 
బాల్యంలో అందరికి లాగే రాజమౌళి సంప్రదాయవాదే. యుక్త వయసులో ఉన్నప్పుడు కాషాయం కట్టుకుని పూజలు బాగా చేసేవాడట. గుళ్లతోపాటు చర్చిలకు కూడా వెళ్లేవాడట. ఎంత చేసినా తనకు సంతృప్తి, సంతోషం ఉండేది కాదని. కొన్నేళ్ల తర్వాత సినీ పరిశ్రమలోకి వచ్చినపుడు నాస్తికుడైన గుణ్ణం గంగరాజుతో కలిసి పనిచేయడం ప్రారంభించినప్పుడు తన దృక్పథమే మారిపోయిందని రాజమౌళి చెప్పాడు.
 
అమృతం సీరియల్‌తో విశేష ప్రచారం పొందిన గుణ్ణం గంగరాజు ఒకసారి ఆయాన్‌ర్యాండ్‌ రాసిన ‘ఫౌంటెన్‌హెడ్‌’ పుస్తకాన్ని రాజమౌళికి ఇచ్చారట. ఆ పుస్తకం తన ఆలోచనా విధానం, వ్యక్తిత్వంపై చాలా ప్రభావం చూపిందంటూ తాను ఆస్తికుడి నుంచి నాస్తికుడిగా మారిపోయానని రాజమౌళి చెప్పారు. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీలో పవన్ కళ్యాణ్ 'తుఫాన్' - నేడు ప్రధాని మోడీతో భేటీ!!

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments