Webdunia - Bharat's app for daily news and videos

Install App

హత్య ట్రైలర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ లా ఉంది : అడివి శేష్, సందీప్ కిషన్

Webdunia
సోమవారం, 17 జులై 2023 (18:17 IST)
Adivi Shesh, Sandeep Kishan, Vijay Antony and others
హీరోలు అడివి శేష్, సందీప్ కిషన్ అతిథులుగా కోలీవుడ్ హీరో విజయ్ అంటోని నటిస్తున్న కొత్త సినిమా ‘హత్య’ ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌ డ్రాప్‌లో దర్శకుడు బాలాజీ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో విజయ్ ఆంటోని డిటెక్టివ్ పాత్రలో కనిపించనున్నారు. రితికా సింగ్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించారు. లోటస్ పిక్చర్స్‌, ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్స్ పై  కమల్ బోరా, జి.ధనుంజయన్, ప్రదీప్ బి, పంకజ్ బోరా, విక్రమ్ కుమార్, తాన్ శ్రీ దొరైసింగం పిళ్లై, సిద్ధార్థ్ శంకర్, ఆర్‌విఎస్ అశోక్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 21న గ్లోబల్ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్ ద్వారా తెలుగులో విడుదలవుతోంది.
 
హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ - విజయ్ ఆంటోనీ గారు సెలెక్ట్ చేసుకునే సబ్జెక్ట్స్ చాలా బాగుంటాయి. డిఫరెంట్ స్టోరీస్ ను సాధారణ ప్రేక్షకులకు నచ్చేలా రూపొందిస్తుంటారు. ఆయన మంచి మ్యూజిక్ డైరెక్టర్ కూడా. విజయ్ గారి పాటలకు నేను అభిమానిని. దర్శకుడు బాలాజీ నాకు బాగా పరిచయం. హత్య ట్రైలర్ చూస్తుంటే సినిమాకు ఒక లాంగ్వేజ్ ఉంటుందని బాలాజీ గారు చేసి చూపించారు. నిర్మాత బి ధనుంజయ్ గారు బై లింగ్వల్ ఫిల్మ్స్ చేసి తెలుగు  మాట్లాడటం నేర్చుకున్నారు. మీనాక్షి అడుగుపెట్టిన ప్రతిచోటా సక్సెస్ అందుకుంటోంది. హత్య టీమ్ కు బెస్ట్ విశెస్ చెబుతున్నా. అన్నారు.
 
హీరో అడివి శేష్ మాట్లాడుతూ, ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే తెలుగు సినిమా, తమిళ సినిమాలా లేదు ఇంటర్నేషనల్ ఫిల్మ్ లా ఉంది. దర్శకుడు బాలాజీ గారు ..మీ నెక్ట్ సినిమాలో హీరోను సెలెక్ట్ చేసుకునే ముందు నా గురించి ఆలోచించండి. ఇక్కడున్న సందీప్, మీనాక్షి, విజయ్ ఆంటోనీ, నేను మేమంతా స్వతహాగా ఎదిగిన వాళ్లం. మా రాతను మేమే రాసుకున్నాం. ప్రేక్షకులు ఈ సినిమాకు సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.
 
హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ, ఫిల్మ్ మేకింగ్ లో బాలాజీ గారికి పూర్తి అవగాహన ఉంది. హత్య సినిమా మేకింగ్ లో మా ప్రొడక్షన్ సంస్థలు ఎంతో ఇన్వాల్వ్ అయ్యాయి. ఈ సినిమా మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వింటే హాలీవుడ్ డిటెక్టివ్ మూవీస్ గుర్తొస్తాయి. గిరిష్ అంత మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాను సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
 
దర్శకుడు బాలాజీ కుమార్ మాట్లాడుతూ, విజయ్ ఆంటోనీ ప్రతిసారీ కొత్త కంటెంట్ తో మీ ముందుకు వస్తుంటారు. ఈ సినిమా కూడా అలాగే విభిన్నంగా  ఉంటుంది. 1923లో జరిగిన ఓ ఘటన ఆధారంగా హత్య చిత్రాన్ని రూపొందించాను. మా కంటే థియేటర్ లో సినిమానే మాట్లాడితే బాగుంటుంది. ఒక మంచి థ్రిల్లర్ మూవీగా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. అన్నారు. 
 
సంగీత దర్శకుడు గిరీష్ గోపాలకృష్ణన్ మాట్లాడుతూ, హత్య సినిమా కోసం డిఫరెంట్ మ్యూజిక్ ట్రై చేశాం. థ్రిల్లర్ కాబట్టి మ్యూజిక్ ప్యాట్రన్ లో వేరియేషన్ తీసుకొచ్చాం. యూరప్ లో ఫేమస్ అయిన ఓఫ్రా స్టైల్ లో ఓ పాట చేశాం. అలాగే మంచి లిరిక్స్ కుదిరాయి. అన్నారు.
 
నిర్మాత జి. ధనుంజయన్ మాట్లాడుతూ, ఒక యూనిక్  థ్రిల్లర్ మూవీ అనుభూతిని మా సినిమా కలిగిస్తుంది. అయితే సినిమా చూసిన వారు స్పాయిలర్స్ ద్వారా కథలో  విలన్ ఎవరు అనేది దయచేసి రివీల్ చేయకండి. ఆ ట్విస్ట్ ను థియేటర్ లోనే చూస్తే బాగుంటుంది. విజయ్ ఆంటోనీ గారితో పాటు మీనాక్షి చౌదరి ఈ సినిమాకు ఓ ఫిల్లర్  గా నిలబడింది. ఆమె ఈ సినిమాకు బాగా ప్రమోషన్ చేసింది. చెప్పారు.
 
హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ - నేను చేసిన ఈ క్యారెక్టర్ లో నటిస్తున్నప్పుడు నన్ను నేను మర్చిపోయి లైలాగా మారాను. ఈ సినిమా నాకొక బ్యూటిఫుల్ ఎక్సీపిరియన్స్. ఈ సినిమాతో నన్ను మరింత ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నా. మహేశ్ బాబు గారి గుంటూరు కారం సినిమాలో  ఓ కీ రోల్ చేస్తున్నాను. ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేశాం. గుంటూరు కారం ఫస్ట్ డే షూట్ ఎక్సీపిరియన్స్ మర్చిపోలేను. అని చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

బంగాళాఖాతంలో అల్పపీడనం : ఏపీతో సహా ఆ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments