Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కల్కి 2898' ఏడీ విడుదలలో జాప్యం!! కారణం ఏంటంటే...

Webdunia
మంగళవారం, 25 జులై 2023 (19:05 IST)
ప్రభాస్ హీరోగా, కమల్ హాసన్ విలన్‌గా నటిస్తున్న చిత్రం కల్కి 2898 ఏడీ. ఈ చిత్రం కోసం అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన దీని గ్లింప్స్‌ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. దీంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది చూసిన సినీప్రియులు కాస్త నిరాశకు గురవుతున్నారు.
 
నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా విడుదల వాయిదా తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించినప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతికి దీన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు మేకర్స్‌ వెల్లడించారు. 
 
అయితే ఇటీవల జరిగిన 'శాన్‌ డియాగో కామిక్ కాన్‌' ఈవెంట్లో ఈ చిత్ర విడుదల తేదీపై స్పష్టత వస్తుందని అంతా అనుకున్నారు. కానీ మేకర్స్‌ ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి కూడా ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారని ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. 
 
దానికి కూడా 'కల్కి' చిత్రబృందం సమాధానం చెప్పలేదు. దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్‌ వాయిదా వార్తలు జోరందుకున్నాయి. ఈ సినిమా రెండు భాగాలుగా రానుందని మొదటి పార్ట్‌ను మే 9న విడుదల చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.
 
ఆ రోజు అశ్వనీదత్‌కు చాలా సెంటిమెంట్‌ అని తెలుస్తోంది. అశ్వనీదత్‌కు మే 9వ తేదీన విడుదలైన 'మహానటి' మళ్లీ బ్లాక్‌ బస్టర్‌ అందించింది. అలాగే చిరంజీవి నటించిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి' కూడా అదే రోజు రిలీజ్ అయి వసూళ్ల వర్షం కురిపించింది. దీంతో ఈ భారీ బడ్జెట్‌ సినిమాకు కూడా ఆయన ఇదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతారని అనుకుంటున్నారు.
 
కానీ, 'కల్కి' వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌కు కూడా చాలా సమయం పట్టేలా కనిపిస్తుంది. దీంతో ఈ సినిమా వాయిదా వేయడమే సరైందని మేకర్స్‌ భావిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై మేకర్స్‌ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సోషల్ మీడియాలో మాత్రం సంక్రాంతికి వాయిదా వేసినట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేవలం 11 సీట్లా..? ఇంత ఘోరంగా ఓడిపోతామని కలలో కూడా ఊహించలేదు : అంబటి

అమెరికాలో మరో విషాదం : కూలిన ప్రైవేట్ జెట్... ఆరుగురు దుర్మరణం

బండికి వార్నింగ్ : గద్దర్ అన్న గల్లీ అని రాసుకునేటట్లు చేస్తా బిడ్డా.. సీఎం రేవంత్ రెడ్డి

మనిషి కాదు.... కామాంధుడు కంటే ఎక్కువ.. కుక్కను కూడా వదిలిపెట్టలేదు... (Video)

Hyderabad Realtor: అప్పులు చేసి అపార్ట్‌మెంట్ నిర్మాణం, ఫ్లాట్స్ అమ్ముడవక ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments