Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆదిపురుష్‌ తర్వాత ప్రభాస్‌కు కల్కి కాంట్రవర్సీ కానుందా!

Advertiesment
Prabhas-kalki
, మంగళవారం, 25 జులై 2023 (12:14 IST)
Prabhas-kalki
ఆదిపురుష్‌తో ప్రభాస్‌ పాన్‌ ఇండియా సినిమా చేసినా ఆ సినిమా పూర్తి నెగెటివ్‌ టాక్‌ రావడంతోపాటు రాముడిగా ప్రభాస్‌ను మీసాలతో చూపిస్తూ పురాణాలను కించపరిచారని దేశమంతా గొడవ జరిగింది. ఆ తర్వాత అసలు రామాయణం కథకాదు ఇది తన కల్పితమని దర్శకుడు ఓం రౌత్‌ చెప్పాడు. ఇక ఇప్పుడు కల్కి అనే సినిమాతో ప్రభాస్‌ వస్తున్నాడు. పురణాల ప్రకారం దేశమంతా నీళ్లతో మునిగిపోయి, అంధకారంలో వుండగా ఓ శక్తిగా కల్కి అవతారం ఉద్భవిస్తుందని చెబుతారు.
 
అయితే ఇప్పుడు ఆ కథను కల్కి 2698 ఎ.డి.గా నాగ్‌ అశ్విన్‌ తీస్తున్నారు. అసలు ఈ కథను ఒకప్పుడు యువ హీరో చేయాలనుకున్నాడు. ఆయన 2010లో కర్మ అనే సినిమాను చేశాడు. ఆయనే అడవి శేష్‌.  దర్శకుడు, హీరోకూడా ఆయనే. తాజాగా అంటే 2023లో ఇప్పటికీ ఆ కథను తెరకెక్కిస్తున్నారని ఇండస్ట్రీ టాక్‌. కర్మ అనే సినిమాలో ముగింపులో ఓ డైలాగ్‌ వుంటుంది. దేవుడు మనకు కనిపిస్తాడా? అంటే కల్కిరూపంలో కలియుగంలో కనిపిస్తాడంటూ నెక్ట్స్‌ అదే అనే ముగింపు వుంటుంది. అయితే దాని గురించి అడవిశేష్‌ సినిమా చేయాలనుకున్నా కొన్ని ప్రాజెక్ట్‌ల వల్ల అది అటకెక్కింది. అప్పట్లో కల్కి అవతారంగా అడవిశేస్‌ ఓ గెటప్‌ వేశాడని పిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ప్రభాస్‌ కంటే ముందుగానే శేష్‌ ఈ సినిమా చేయాలనుకున్నాడని తెలుస్తోంది. ముందుముందు కల్కి సినిమా ఎటువంటి ట్విస్ట్‌లు ఇస్తుందో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్రేకింగ్ న్యూస్: పుష్ప2 సెట్‌లో రష్మికను అవమానించిన అల్లు అర్జున్?