Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిల్ రాజుతో గొడ‌వ‌ ఏంటో బ‌య‌ట‌పెట్టిన హ‌రీష్ శంక‌ర్.

Webdunia
మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (11:14 IST)
టాలెంటెడ్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్.. టేస్ట్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు... వీరిద్ద‌రి మ‌ధ్య మంచి అనుబంధం ఉంది. హ‌రీష్‌తో దిల్ రాజు దాగుడు మూత‌లు అనే సినిమా చేయాల‌నుకున్నారు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ కూడా స్టార్ట్ చేసారు. అయితే... ఏమైందో ఏమో కానీ.. ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ల‌కుండానే ఆగిపోయింది. అప్ప‌టి నుంచి దిల్ రాజు, హ‌రీష్ శంక‌ర్ మ‌ధ్య గొడ‌వ‌లు అంటూ జోరుగా ప్ర‌చారం జ‌రిగింది.
 
ఇదిలా ఉంటే... హ‌రీష్ శంక‌ర్ తాజాగా వాల్మీకి అనే సినిమాని తెర‌కెక్కించారు. సెప్టెంబ‌ర్ 20న ఈ సినిమా థియేటర్లలోకి రానుండటంతో చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్ షురూ చేసింది. ఇప్పటికే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఘనంగా జరుపుకున్న చిత్రబృందం.. దర్శక నిర్మాతలు, నటీనటులు మీడియా ముందుకొచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. 
 
తాజాగా డైరెక్టర్ హరీశ్ శంకర్ సినిమా గురించి ఆసక్తికర విషయాలతో పాటు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్‌ రాజుతో ఉన్న వివాదాలపై హరీష్‌ స్పందిస్తూ.. క్లారిటీ ఇచ్చారు. ఇంత‌కీ హ‌రీష్ శంక‌ర్ ఏం చెప్పాడంటే... దిల్ రాజు నిర్మాతగా దాగుడుమూతలు సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్రయత్నించాను. 
 
అయితే కొన్ని కారణాల వలన అది కుదరలేదు. దీంతో దిల్ రాజుతో గొడవపడినట్టుగా వార్తలు షికారు చేశాయి. నిజానికి దిల్ రాజుతో పెద్ద గొడవేం జరగలేదు. కాస్టింగ్ విషయంలోనే ఆయనతో ఇబ్బంది. అంతే. అవి అభిప్రాయం భేదాలు కాదండి కేవలం, క్రీయేటివిటీ డిఫ‌రెన్స్ మాత్రమే. ఒక చిత్రం విషయంలో నటీనటుల విషయంలో మా అభిప్రాయాలు కలవలేదు. 
 
అంతే కానీ అదేమీ గొడవ కాదు. మా చిత్రం వాల్మీకి వైజాగ్ ఏరియా ఆయనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అని హరీష్‌ శంకర్ క్లారిటీ ఇచ్చారు. ఇక నుంచైనా వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ గురించి వార్త‌ల‌కు ఫుల్ స్టాఫ్ ప‌డుతుందేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంజనేయ స్వామికి ఆలయంలో వానరం.. గదపట్టుకుని దర్శనం (video)

కుమారుడికి క్షమాభిక్ష పెట్టుకున్న జో బైడెన్!!

మానవత్వాన్ని చాటిన నందిగామ ఎస్సై.. ఏం చేశారంటే? (video)

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్.. డిప్యూటీ సీఎం రేసులో శ్రీకాంత్ షిండే!!

భోజనం పళ్లెంలో ఏమేం ఉండాలి? రోజుకు ఎంత ప్రోటీన్ అవసరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments