Webdunia - Bharat's app for daily news and videos

Install App

#Mahanati : 'ఆకాశ వీధిలో అందాల జాబిలి'కి పుట్టినరోజు శుభాకాంక్షలు...

'నేను శైలజ'తో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన మలయాళ హీరోయిన్ కీర్తి సురేష్ ఒకరు. ఈమె టాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయమై ఆ తర్వాత ‘నేను లోకల్‌’తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఈ మలయాళ కుట్టి మంగళవారం

Webdunia
మంగళవారం, 17 అక్టోబరు 2017 (11:55 IST)
'నేను శైలజ'తో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన మలయాళ హీరోయిన్ కీర్తి సురేష్ ఒకరు. ఈమె టాలీవుడ్‌ ప్రేక్షకులకు పరిచయమై ఆ తర్వాత ‘నేను లోకల్‌’తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఈ మలయాళ కుట్టి మంగళవారం 25వ పుట్టినరోజును జరుపుకుంటుంది. 
 
ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపింది ‘మహానటి’ యూనిట్‌. సావిత్రి బయోపిక్‌లో కీర్తి సురేష్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తుండగా, ఈ సందర్భంగా ఓ పోస్టర్‌ను విడుదల చేస్తూ, దాని ద్వారా బర్త్‌డే విషెస్‌ తెలిపింది. 
 
ఈ పోస్టర్‌లో ఆమె కళ్లు, బొట్టు మాత్రమే కనిపిస్తుండగా, "ఆకాశ వీధిలో అందాల జాబిలి" అనే క్యాప్షన్‌ను పెట్టి, హ్యాపీ బర్త్‌డే టు వన్‌ అండ్‌ ఓన్లీ మహానటి అంటూ కామెంట్‌ పెట్టారు. ప్రస్తుతం ఈ లుక్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుండగా, కీర్తి సురేష్‌ సావిత్రిని తలపిస్తుందని అభిమానులు తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. 
 
ఇక ఈ చిత్రంలో సమంత, దుల్కర్‌ సల్మాన్‌, విజయ్‌ దేవరకొండ, షాలిని, ప్రకాష్‌ రాజు, మోహన్‌బాబు తదితరులు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. 'ఎవడే సుబ్రమణ్యం' ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న ఈ మూవీని ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్‌ నిర్మిస్తుండగా, మిక్కీ జే మేయర్‌ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కనుసన్నల్లోనే పహల్గాం ఉగ్రదాడి : పంజాబ్ మంత్రి!!

Bihar: భర్తతో గొడవ.. నలుగురు పిల్లలతో కలిసి విషం తాగింది.. ఆ తర్వాత ఏమైందంటే?

Manipur: మణిపూర్‌ చందేల్ జిల్లాలో ఆపరేషన్- పదిమంది మిలిటెంట్లు మృతి

PM Modi: విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.. ప్రధాని హాజరు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments