Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అందాలు ఆరబోసే పాత్రలు చేయబోనంటున్న కీర్తి సురేష్

అందాలు ఆరబోసే పాత్రలు చేసే ప్రసక్తే లేదని టాలీవుడ్‌కు పరిచయమైన కేరళ భామ కీర్తి సురేష్ అంటోంది. ప్రస్తుతం తాను తెలుగులో పవన్ కళ్యాణ్ సినిమాలోనూ.. 'మహానటి' మూవీలోనూ చేస్తోంది. తన కెరీర్ గురించి ఆమె స్పం

Advertiesment
Keerthi Suresh
, శనివారం, 14 అక్టోబరు 2017 (14:32 IST)
అందాలు ఆరబోసే పాత్రలు చేసే ప్రసక్తే లేదని టాలీవుడ్‌కు పరిచయమైన కేరళ భామ కీర్తి సురేష్ అంటోంది. ప్రస్తుతం తాను తెలుగులో పవన్ కళ్యాణ్ సినిమాలోనూ.. 'మహానటి' మూవీలోనూ చేస్తోంది. తన కెరీర్ గురించి ఆమె స్పందిస్తూ, పవన్‌తో మూవీ చాలా స్పెషల్ అనీ, 'మహానటి' తన కెరీర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేసింది.
 
ఇకపోతే అందాల ప్రదర్శనకి తాను చాలా దూరమని, అందాలను ఒలకబోసే పాత్రలకి తాను నప్పననీ, అందువల్ల ఆ తరహా పాత్రలను చేయకూడదని తాను నిర్ణయించుకున్నట్టు చెప్పుకొచ్చింది. ఇప్పుడే కాదు.. భవిష్యత్తులోనూ తాను ఇదే మాటపై ఉంటానని చెప్పింది. 
 
కాగా, తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా అగ్రస్థానాన్ని అందుకోవడానికి కీర్తి సురేశ్‌కి ఎంతో కాలం పట్టలేదు. ఈ రెండు భాషల్లోనూ ఎంచుకున్న కథలు ఆమెకు వరుస సక్సెస్‌‌‌‌లను.. క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లైన హీరోతో ప్రేమలో వున్న సాయిపల్లవి.. నాని పోటీ పడి యాక్టింగ్..