Webdunia - Bharat's app for daily news and videos

Install App

బన్నీ, మహేష్‌తో మాస్ మహారాజా పోటీ.. క్రాక్‌లో వరలక్ష్మి, శ్రుతిహాసన్

Webdunia
ఆదివారం, 26 జనవరి 2020 (16:53 IST)
అల్లు అర్జున్, మహేష్ బాబులతో మాస్ మహారాజా పోటీ పడుతున్నాడు. రవితేజ హీరోగా నటించిన డిస్కోరాజా సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన ఈ సినిమా బంపర్ హిట్ అయ్యింది. రిపబ్లిక్ డే రోజునే రవితేజకు పుట్టిన రోజు కావడంతో అంతా కలిసొచ్చింది. 
 
మాస్ మహారాజా రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన సినిమా డిస్కోరాజా. భారీ అంచనాల నడుమ విడుదలైన డిస్కోరాజా మూవీలో రవితేజ సరసన పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌, తాన్యా హోప్ హీరోయిన్లుగా నటించారు. జనవరి 24వ తేదీన విడుదలైన ఈ సినిమా తొలి షో తోనే మిశ్రమ స్పందన తెచ్చుకొని చెప్పుకోదగిన కలెక్షన్స్ రాబడుతోంది.
 
ఓ ఏరియాలో అల్లు అర్జున్, మహేష్‌ బాబు సినిమాలతో పోటీపడి దాదాపుగా ఆ రేంజ్ వసూళ్లు రాబట్టింది. తొలి రోజే ఈ సినిమా 3.5 కోట్ల రేంజ్ షేర్ రాబట్టినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో మంచి జోష్ కనబరుస్తున్న రవితేజ.. ఉత్తరాంధ్ర ఏరియాలో రెండో రోజు (శనివారం) కూడా కుమ్మేశాడు. 22 లక్షల షేర్ రాబట్టి మహేష్, అల్లు అర్జున్ సినిమాల సరసన నిలిచాడు.
 
ఇదిలా ఉంటే.. మాస్ మహారాజ రవితేజ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకి సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ప్రస్తుతం రవితేజ క్రాక్ సినిమాతో బిజీగా ఉన్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఈ చిత్రబృందం.. రవితేజకి బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ వీడియోని విడుదల చేశారు. ఇప్పుడీ వీడియోసోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
అంతేకాదు.. క్రాక్ రిలీజ్ డేట్‌ని కూడా ప్రకటించారు. మే 8న 'క్రాక్'ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు. రవితేజకి జంటగా శృతి హాసన్ నటిస్తోంది. వరలక్ష్మీ శరత్ కుమార్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. తమిళ నటుడు సముద్రఖని మరో కీలకపాత్ర పోషిస్తున్నారు.

ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు ఈ చిత్రంలో రవితేజ పోలీస్‌ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. సరస్వతి ఫిలిం డివిజన్‌ బ్యానర్‌పై బీ మధు చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Suryapet YouTuber: పాక్‌కు మోటార్ సైకిల్ ట్రిప్- ట్రావెల్ వ్లాగర్ బయ్యా సన్నీ యాదవ్‌ అరెస్ట్

పాకిస్తాన్ పర్యటించిన తెలుగు యూట్యూబర్ బయ్యా సన్నీని అరెస్ట్ చేసిన ఎన్ఐఎ

వల్లభనేని వంశీకి మధ్యంతర బెయిల్.. జైలు నుంచి విడదలలో జాప్యం...

రూ. 300 కోసం పాట్నా రైల్వే స్టేషనులో విటుడికై మహిళ ఎదురుచూపు, తర్వాత ఏం జరిగింది? (video)

కోతికి గొడుగు అందించిన యువతి, గాల్లో తేలినట్టుందే (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments