Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్గాన్ మాఫియా నేపథ్యంలో హాన్సిక చిత్రం మై నేమ్‌ఈజ్ శృతి

Webdunia
శనివారం, 12 మార్చి 2022 (17:49 IST)
Hansika, My Name Is Shruti
ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు రానటువంటి ఆర్గాన్ మాఫియా నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం మై నేమ్‌ఈజ్ శృతి ఇటీవల విడుదలైన టీజర్‌లో చర్మం వలిచి బిజినెస్ చేస్తానమంటున్నారు ఏం చేయాలి వాళ్లను అంటూ కథానాయిక హాన్సిక చెప్పే డైలాగ్‌తో చిత్రంపై క్యూరియాసిటీ పెరిగింది. హాన్సిక ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ ఓంకార్ దర్శకుడు. లేడి ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై బురుగు రమ్య ప్రభాకర్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. 
 
ఇటీవల తెలుగులో విడుదలైన టీజర్ చక్కని స్పందన వచ్చింది. శుక్రవారం ఈ చిత్రానికి సంబంధించిన హిందీ, తమిళ టీజర్‌లను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ తెలుగులో విడుదల చేసిన టీజర్‌కు వచ్చిన స్పందన అనూహ్యం. టీజర్ ఆద్యంతం ఆసక్తిగా వుండటంతో సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది. వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో, ప్రతి సన్నివేశాన్ని ఎంతో ఆసక్తికరంగా దర్శకుడు మలిచాడు. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు. 
 
దర్శకుడు మాట్లాడుతూ సినిమా చూస్తున్నంత సేపు తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ...ముగింపు వరకు ఎవరూ ఊహించలేని ట్విస్ట్‌లతో వుంటుంది  అన్నారు. మురళీశర్మ, ఆడుకలం నారాయణ్, జయప్రకాష్ (జేపీ), ప్రవీణ్, సీవీఎల్ నరసింహారావు, కేదారి శంకర్, పూజా రామచంద్రన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కిషోర్ బోయిడపు, సంగీతం: మార్క్ రాబీన్, ఎడిటర్: చోటా.కె.ప్రసాద్, స్టంట్స్: రాబిన్ సుబ్బు, సాహిత్యం: కృష్ణకాంత్, ఆర్ట్: గోవింద్ ఎరసాని, లైన్‌ప్రొడ్యూసర్: విజయ్‌కుమార్ కర్రెం, కో-ప్రొడ్యూసర్: పవన్‌కుమార్ బండి, నిర్మాత: బురుగు రమ్య ప్రభాకర్, రచన-దర్శకత్వం: శ్రీనివాస్ ఓంకార్.

సంబంధిత వార్తలు

ఆ బాలిక ఆత్మవిశ్వాసంతో అద్భుత విన్యాసాలు - video

16 ఏళ్ల బాలిక-14 ఏళ్ల బాలుడు... చున్నీతో చేతులు కట్టేసుకుని సముద్రంలో దూకేశారు..?

బీజేపీ నేత ఆరతి కృష్ణ యాదవ్ ఏకైక కుమారుడు ఆస్ట్రేలియాలో మృతి

ప్రపంచ జీవన కాలం.. పదేళ్ల పురోగతిని తిప్పికొట్టిన కోవిడ్ మహమ్మారి

టీడీపీ క్యాడర్ కోసం రూ.10 కోట్లతో నిధి.. నారాయణకు హ్యాట్సాఫ్

ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే

ప్రోటీన్ సప్లిమెంట్లను భర్తీ చేయగల సహజమైన, ప్రోటీన్ అధికంగా కలిగిన ఆహారం

షుగర్ వ్యాధిని అదుపులోకి తెచ్చే పదార్థాలు ఏంటి?

బెల్లం టీ తాగండి.. పొట్ట చుట్టూ కొవ్వును ఇట్టే కరిగించుకోండి..

కిడ్నీలను ఆరోగ్యంగా వుంచుకునే ఆహారం.. ఖాళీ కడుపుతో వెల్లుల్లి..

తర్వాతి కథనం
Show comments