Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈషారెబ్బ కోలీవుడ్‌ సినిమాకు ఆ టైటిల్ ఖరారైందట..

Webdunia
మంగళవారం, 8 అక్టోబరు 2019 (11:21 IST)
ఈషారెబ్బ కోలీవుడ్‌లో రెండో సినిమాలో కనిపించనుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమా‌లో హీరోయిన్ చెల్లెలి పాత్రలో కనిపించిన ఈషారెబ్బా.. తెలుగులో ప్రస్తుతం డమరకం ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి డైరెక్షన్ లో 'రాగల 24 గంటల్లో' అనే హారర్ థ్రిల్లర్‌లో నటిస్తుంది. ఈ  సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. 
 
దీంతో పాటు కోలీవుడ్‌లో జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా ప్రముఖ దర్శకుడు ఏజిల్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న చిత్రంలో ఈషా రెబ్బా కథానాయికగా నటిస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రానికి 'ఆయిరం జన్మంగల్' (వెయ్యి జన్మలు) అనే టైటిల్ ఖరారు చేశారు. యువ హీరో విష్ణు విశాల్ ఈ టైటిల్‌ను రివీల్ చేశారు.
 
హారర్ కామెడీ నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్నారై గర్ల్ నిఖిషా పటేల్, ప్రముఖ కమెడియన్ సతీష్ ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. అభిషేక్ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. కాగా ఈషా రెబ్బాకు తమిళంలో ఇది రెండో సినిమా. ఇంతకుముందు ఆమె 'ఓయ్' అనే చిత్రం తో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments