Webdunia - Bharat's app for daily news and videos

Install App

జివి ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ డియర్ వెడ్డింగ్ పాట

డీవీ
మంగళవారం, 2 ఏప్రియల్ 2024 (17:28 IST)
Dear Wedding Song
జివి ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న కామెడీ ఫ్యామిలీ డ్రామా 'డియర్'. ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. నట్‌మెగ్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ బ్యానర పై వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామిశెట్టి, జి పృథ్వీరాజ్ నిర్మించారు.  
 
తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదలకు ఒక్కరోజు గ్యాప్ ఉంటుంది. తమిళ వెర్షన్ ఏప్రిల్ 11న విడుదల కానుండగా, తెలుగు వెర్షన్ ఏప్రిల్ 12న విడుదల కానుంది.
 
తాజాగా డియర్ నుంచి భలే వెడ్డింగ్ పాటని విడుదల చేశారు. ఈ చిత్రానికి మ్యూజిక్ కూడా అందిస్తున్న జివి ప్రకాష్ కుమార్ ఈ పాట ని పుట్ ట్యాపింగ్ వెడ్డింగ్ నెంబర్ గా కంపోజ్ చేశారు.
 
రాకేందు మౌళి లిరిక్స్ అందించిన ఈ పాటని నారాయణన్ రవిశంకర్, సిందూరి విశాల్ గ్రేస్ ఫుల్ గా ఆలపించారు. ఈ పాటలో జివి ప్రకాష్ కుమార్, ఐశ్వర్య రాజేష్ కెమిస్ట్రీ బ్యూటీఫుల్ గా వుంది. ఈ వెడ్డింగ్ నెంబర్ లో వారి డ్యాన్స్ మూమెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
 
ఈ సినిమా ఆంధ్రా థియేట్రికల్ హక్కులను అన్నపూర్ణ స్టూడియోస్ కొనుగోలు చేయగా, ఏషియన్ సినిమాస్ తెలంగాణ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది. హ్యూజ్ థియేట్రికల్ చైన్ బిజినెస్లు ఉన్న ప్రొడక్షన్ , డిస్ట్రిబ్యూషన్ సంస్థల బ్యాకింగ్ తో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో  చాలా గ్రాండ్ గా విడుదల కానుంది.
 
డియర్‌లో కాళి వెంకట్, ఇళవరసు, రోహిణి, తలైవాసల్ విజయ్, గీతా కైలాసం, నందిని ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు
 జగదీష్ సుందరమూర్తి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Green anacondas: వామ్మో.. కోల్‌కతాలోని అలీపూర్ జూకు రెండు ఆకుపచ్చ అనకొండలు

Khazana Jewellery: ఖ‌జానా జ్యువెల‌రీలో దోపిడీ.. ఎంత ఎత్తుకెళ్లారంటే..? (video)

ఆస్తి కోసం కన్నతల్లిపై కొడుకు కత్తితో దాడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ...

జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్- వైఎస్ అవినాశ్ రెడ్డి అరెస్ట్.. ఇవి ఎన్నికలా? సిగ్గుగా వుందంటూ జగన్ ఫైర్ (video)

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో వర్షాలే వర్షాలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

తర్వాతి కథనం
Show comments