Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మూడు యుగాల కథ, మూడు విభిన్న పాత్రలతో టోవినో థామస్‌ ARM ఫస్ట్ లుక్

Advertiesment
Tovino Thomas - ARM first look

డీవీ

, సోమవారం, 22 జనవరి 2024 (13:16 IST)
Tovino Thomas - ARM first look
పూర్తిగా 3డిలో రూపొందిన ”ARM” మలయాళ సినిమా చరిత్రలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలలో ఒకటి. టోవినో థామస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కి అద్భుతమైన స్పందన వస్తోంది. టోవినో థామస్ తన తాజా పాన్-ఇండియా ఫాంటసీ చిత్రం ”ARM”తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు జితిన్ లాల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మ్యాజిక్ ఫ్రేమ్స్, UGM మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్, డాక్టర్ జకారియా థామస్ నిర్మిస్తున్నారు.
 
చిత్రంలో కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్,  సురభి లక్ష్మి వంటి భారీ తారాగణం ఉంది, మూడు యుగాల కథ, “ARM” టోవినో థామస్‌ను 3 విభిన్న పాత్రలు - మణియన్, అజయన్, కుంజికేలుగా ప్రజెంట్ చేస్తోంది. భూమి, గాలి, నిప్పు, నీరు,  ఆకాశం ఖగోళ రహస్యం బ్యాక్ డ్రాప్ లో వుండటంతో విజువల్ వండర్ గా ఉండబోతుందని హామీ ఇచ్చింది. ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం మలయాళం, హిందీ, ఇంగ్లీష్, తమిళం, తెలుగు, కన్నడ 6 భాషల్లో విడుదల కానుంది.
 
ప్రముఖ నటులు బాసిల్ జోసెఫ్, జగదీష్, హరీష్ ఉత్తమన్, హరీష్ పేరడి, ప్రమోద్ శెట్టి, రోహిణి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ చిత్రానికి సుజిత్ నంబియార్ స్క్రిప్ట్ రాశారు. దిబు నైనన్ థామస్ సంగీతం అందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేవీ-బ్లూ దుస్తులతో రిఫ్రెష్ గా వున్నానంటున్న మాళవిక మోహనన్