Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్ట్ అప్‌డేట్ వచ్చేసింది..!

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (12:06 IST)
గుణశేఖర్ రుద్రమదేవి సినిమా తెరకెక్కించడం.. ఆ సినిమా విజయం సాధించడం తెలిసిందే. ఈ సినిమా తర్వాత గుణశేఖర్... హిరణ్యకశ్యప అనే సినిమా చేయనున్నట్టు ప్రకటించారు. ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని.. ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్నట్టు చెప్పారు. ఇది చెప్పి చాలా రోజులు కాదు కాదు సంవత్సరాలు అయ్యింది కానీ.. దీనికి సంబంధించి అప్‌డేట్ రాలేదు.
 
అయితే, గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్ట్‌కి సంబంధించి అప్‌డేట్ వచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే... హిరణ్యకశ్యప ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యిందని గుణశేఖర్ ట్వీట్ చేసారు.
 
 ఈ ప్రాజెక్ట్‌ను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు సాధారణ పరిస్థితుల కోసం వేచిచూస్తున్నాం.. ఓం నమో నారాయణాయ’’ అని గుణశేఖర్ తన ట్వీట్‌ చేయడంతో ఈ సినిమా గురించి మరింత ఆసక్తి ఏర్పడింది.
 
ఈ మూవీని దగ్గుబాటి రానాతో గుణశేఖర్ తెరకెక్కించనున్నారు. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందే ఈ సినిమాని సురేష్‌ ప్రొడక్షన్స్, హాలీవుడ్ సంస్థతో కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారు. రానాతో పాటు నటించే మిగిలిన నటీనటులు ఎవరు..? సురేష్‌ ప్రొడక్షన్స్‌తో పాటు కలిసి నిర్మించే హాలీవుడ్ నిర్మాణ సంస్థ ఏది..? అనేది త్వరలోనే తెలియనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సూట్‌కేసులో భార్య మృతదేహం.. పూణెలో భర్త అరెస్టు!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో ఎదురుదెబ్బ

Drone: లారీ ట్రక్కులో పేకాట.. డ్రోన్ సాయంతో మఫ్టీలో వెళ్లిన పోలీసులు.. అరెస్ట్ (video)

Chandrababu Naidu: ఇఫ్తార్ విందులో చంద్రబాబు.. పేద ముస్లిం ఆకలితో ఉండకుండా..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments