Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమౌళి చిత్రానికి హీరోయిన్ కష్టాలు : 'ఆర్ఆర్ఆర్' నుంచి అలియా ఔట్?

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (11:17 IST)
దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి నిర్మిస్తున్న మల్టీస్టారర్ చిత్రం 'ఆర్ఆర్ఆర్' - (రౌద్రం - రణం - రుధిరం). ఇందులో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తున్నారు. అయితే, రామ్ చరణ్ సరసన అలియా భట్‌ను జూనియర్ ఎన్టీఆర్ సరసన బ్రిటిషన్ మోడల్ ఒవియా మోరిస్‌ను హీరోయిన్లుగా ఎంపిక చేశారు. 
 
ఆ తర్వాత ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతున్న నేపథ్యంలో కరోనా లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్ నిలిచిపోగా, పరిస్థితి ఓ కొలిక్కి రాగానే షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలని రాజమౌళి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఫోన్ చేసిన ఆలియా, పలు విషయాలను చర్చించినట్టు తెలుస్తోంది.
 
కాగా, ఈ సినిమాకు ఆలియా భట్ కేటాయించిన డేట్స్ అయిపోగా, ఈ విషయాన్ని చెప్పేందుకే ఆలియా ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. తాను ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నానని రాజమౌళి వ్యాఖ్యానించగా, ఆమె తన తర్వాతి ప్రాజెక్టులోకి వెళతానని, అందుకు అంగీకరించాలని కోరినట్టు వార్తలు వచ్చాయి. 
 
ఇక ఈ చిత్రం షూటింగులో ఆలియాకు చెందిన భాగాన్ని ఇప్పటివరకూ ఇంకా ప్రారంభించలేదు. మిగిలిన షూటింగులో ఆలియావే ఎక్కువ సీన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తిరిగి ఆమెనే ఒప్పించి తెస్తారా? లేదా ఎన్టీఆర్‌కు హీరోయిన్‌ను మార్చినట్టే రామ్ చరణ్‌కు కూడా మారుస్తారా? అన్నది వేచి చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments