Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటిన యంగ్ హీరో అల్లు శిరీష్

Webdunia
శనివారం, 4 జులై 2020 (19:33 IST)
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా హీరో విశ్వ‌క్ సేన్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి నేడు తన ఇంటి గార్డెన్లో మొక్కలు నాటారు హీరో అల్లు శిరిష్. ఈ సందర్భంగా శిరీష్ మాట్లాడుతూ... ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను.
 
ఇప్ప‌ుడున్న జీవిన‌విధానంలో ప‌ర్య‌ావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ అత్యంత అవ‌స‌రం. అందుకే విధిగా మ‌నంద‌రం స్వ‌చ్ఛందంగా మొక్క‌లు నాటాల‌ని కోరుతున్నాను. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా విశ్వ‌క్ సేన్ నాకిచ్చిన ఛాలెంజ్‌ను స్వీక‌రించి నా మేన‌ల్లుడు ఆర్నావ్, మేన‌కోడ‌ల్లు అన్విత‌, స‌మారా, నివ్రితిల‌ను ఈ కార్య‌క్ర‌మానికి నామినేట్ చేస్తున్నాను.
 
రానున్న కొత్త త‌రానికి చెట్ల‌ను, ఏవిధంగా నాటాలి, పెంచాల‌నే విష‌యం తెలియ‌డం చాలా అవ‌స‌ర‌మ‌ని అన్నారు. అందుకే త‌న మేన‌ల్లుడు, మేన‌కోడ‌ళ్లకి ఈ ఛాలెంజ్ స్వీక‌రించాల్సిందిగా నామినేట్ చేస్తున్న‌ట్లు తెలిపారు. అల్లు శిరీష్ ప్ర‌స్తుతం త‌న త‌దుప‌రి సినిమాకి సంబంధించిన కార్య‌క్ర‌మాల్లో ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే రాబోతుంది.

సంబంధిత వార్తలు

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments