Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అల్లు శిరీష్‌కి షాక్ ఇచ్చిన అల్లు అరవింద్..!

Advertiesment
అల్లు శిరీష్‌కి షాక్ ఇచ్చిన అల్లు అరవింద్..!
, శుక్రవారం, 13 మార్చి 2020 (20:07 IST)
అఖిల్, నిఖిల్, నాని, సాయిధరమ్ తేజ్.. ఇలా యంగ్ హీరోలతో సినిమాలు నిర్మిస్తున్నాడు కానీ.. అల్లు శిరీష్‌తో అల్లు అరవింద్ ఇటీవల సినిమా చేయలేదు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అల్లు అరవింద్ అడిగితే.. ఏ డైరెక్టర్ అయినా సినిమా చేస్తారు. అలాంటిది ఎందుకు అల్లు శిరీష్‌ని పట్టించుకోవడం లేదు..? శిరీష్‌తో ఎందుకు సినిమా ప్లాన్ చేయడం లేదు అని ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు.
 
కారణం ఏంటి అని ఆరా తీస్తే.. ఈసారి రెగ్యులర్ స్టోరీ కాకుండా డిఫరెంట్ స్టోరీతో అల్లు శిరీష్ సినిమా చేయాలనుకుంటున్నాడని..  రైట్ స్టోరీ కోసం వెయిట్ చేయడం వలన ఆలస్యం అయ్యిందని అల్లు కాంపౌండ్ సమాచారం. ఇక నుంచి అల్లు శిరీష్‌ కొత్త తరహా కథలతో సినిమాలు చేయాలనుకుంటున్నారని తెలిసింది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... తమిళంలో విజయం సాధించిన ఓ మూవీని తెలుగులో రీమేక్ చేయనున్నారని.. ఈ రీమేక్‌లో అల్లు శిరీష్ నటించనున్నట్టు తెలిసింది.
 
ఈ సినిమాకి రాకేష్ శశి దర్శకత్వం వహించనున్నారు. రాకేష్ శశి జత కలిసే, విజేత చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ రెండు చిత్రాలు ఫరవాలేదు అనిపించాయి కానీ.. చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించలేదు. సరైన సక్సస్ కోసం ఎదురు చూస్తున్న అల్లు శిరీష్.. ఈ టైమ్‌లో ఫ్లాప్ డైరెక్టర్ రాకేష్ శశితో సినిమా చేయడం ఏంటి..? శిరీష్ విషయంలో అల్లు అరవింద్ ప్లాన్ ఏంటి..? అనేది చర్చనీయాంశం అయ్యింది. అయితే.. అల్లు అరవింద్, రాకేష్ శశికి అవకాశం ఇచ్చారంటే... అతనిపై ఎంత నమ్మకం ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఖచ్చితంగా శిరీష్‌కి సక్సస్ ఇస్తాడు అనే నమ్మకం ఉండడంతోనే అవకాశం ఇచ్చారని తెలిసింది. మరి.. శిరీష్ ఈ సినిమాతో అయినా సక్సస్ సాధిస్తాడో లేదో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లక్కీ ఛాన్స్ కొట్టేసిన విశ్వక్ సేన్