Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అల్లు శిరీష్ సినిమా ఎప్పుడు?

Advertiesment
Allu Sirish
అల్లు శిరీష్ గౌరవం సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత మారుతి దర్శకత్వంలో రూపొందిన కొత్త జంట సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుని విజయం సాధించాడు. పరశురామ్ డైరెక్షన్లో శ్రీరస్తు శుభమస్తు సినిమాతో మరో విజయం సాధించి ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో ఒక్కక్షణం అనే సినిమా చేసాడు. ఈ సినిమా బాగానే ఉంది అనే టాక్ తెచ్చుకున్నప్పటికీ... కమర్షియల్‌గా సక్సస్ సాధించలేదు. ఆ తర్వాత నటించిన ఏబీసీడీ మూవీ కూడా ప్రేక్షకులను మెప్పించలేదు.
 
ఈ సినిమా తర్వాత అల్లు శిరీష్ సినిమా ఎవరితో చేయనున్నాడు..? ఎప్పుడు ఉంటుంది..? అనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు. గీతా ఆర్ట్స్ బ్యానర్లో భారీ చిత్రాలు నిర్మిస్తుంటే.. జీఏ 2 బ్యానర్లో చిన్న సినిమాలు నిర్మిస్తున్నారు. జీఏ 2 బ్యానర్ పైన ఇటీవల సాయిధరమ్ తేజ్‌తో ప్రతిరోజు పండగే సినిమాని నిర్మించారు. మారుతి దర్శకత్వంలో రూపొందిన ప్రతి రోజు పండగే సినిమా క్రిస్మస్‌కి రిలీజై ఘన విజయం సాధించింది. అటు సాయిధరమ్ తేజ్‌కి, ఇటు మారుతికి మంచి పేరు తీసుకువచ్చింది. 
 
ప్రస్తుతం ఈ బ్యానర్లో అక్కినేని అఖిల్‌తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ మూవీ నిర్మిస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలో షూటింగ్ పూర్తిచేసి సమ్మర్లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయనున్నారు. అలాగే జీఏ 2 బ్యానర్లో ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయతో చావు కబురు చల్లగా అనే సినిమాని నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు కౌశిక్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. 
 
రీసెంట్‌గా నిఖిల్‌తో ఓ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇలా.. అఖిల్, నిఖిల్, కార్తికేయ తదితర హీరోలతో సినిమాలు నిర్మిస్తున్న అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్‌తో ఎందుకు సినిమా నిర్మించడం లేదు..? శిరీష్ విషయంలో అల్లు అరవింద్ ప్లాన్ ఏంటి..? అనేది అర్ధం కావడం లేదు. 
 
అఖిల్, నిఖిల్, కార్తికేయ, సాయిధరమ్ తేజ్... తదితరులతో చేస్తున్న సినిమాలు అల్లు శిరీష్‌తో కూడా చేయచ్చు కానీ అల్లు శిరీష్‌తో సినిమా నిర్మించడం లేదంటే.. వీటి కన్నా పెద్ద బడ్జెట్‌తో భారీ చిత్రం నిర్మించాలి అనుకుంటున్నారా..? లేక వేరే ప్లాన్ ఏమైనా ఉందా..? అనేది ఆసక్తిగా మారింది. మరి.. త్వరలో అల్లు శిరీష్‌తో సినిమా ప్లాన్ చేస్తారేమో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సుకుమార్, ఆ సీన్స్ అన్నింటినీ క్యాన్సిల్ చేసాడా?