Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"ఏబీసీడీ" చిత్రానికి "పిల్ల జ‌మీందార్"కు ఉన్న లింకేంటి?

, శుక్రవారం, 17 మే 2019 (18:43 IST)
యంగ్ హీరో అల్లు శిరీష్‌, రుక్సానా హీరో, హీరోయిన్లుగా న‌టించిన చిత్రం "ఏబీసీడీ". అమెరిక్‌ బోర్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశి అనేది ట్యాగ్‌ లైన్‌. సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధినేత డి. సురేష్‌ బాబు సమర్పణలో మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌, బిగ్‌ బెన్‌ సినిమాస్ బ్యాన‌ర్స్ పై ఈ సినిమా రూపొందింది. సంజీవ్‌ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతోన్న ఈ సినిమాను మధుర శ్రీధర్‌ రెడ్డి, యష్‌ రంగినేని నిర్మించారు.

ఈ చిత్రం ఈరోజు  (మే 17న) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌ రిలీజైంది. ఫస్ట్‌ కాపీ చూశా. చాలా బాగా వచ్చింది. నేనే కాదు మా టీమ్‌ అందరూ సినిమా పై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. మ‌ల‌యాళ సినిమా అయిన ఏబీసీడీ క‌థ‌ను తెలుగుకు తగ్గట్టు చాలా మార్చాం. ఇందులో డ్రామాతో పాటు రకరకాల ఎమోషన్స్‌ ఉంటాయి. ఈ సినిమా గ్రాఫ్‌ నాకు చాలా నచ్చింది. రాంచరణ్‌ ఈ సినిమాను చేయమని సజెస్ట్‌ చేశాడు. ఆ తర్వాత మారుతి, వరుణ్‌ అందరూ చెప్పడంతో ఈ సినిమా చేసాన‌ని అల్లు శిరీష్ చెప్పారు. 
 
కొంతమంది పిల్ల జ‌మీందారు సినిమాకి పోలుస్తున్నారు. థీమ్‌ని వదిలేస్తే, పిల్ల జమీందారుకు, దీనికీ పెద్ద పోలిక ఉండదు. అమెరికాలో ఉండి, గారాబంగా పెరిగిన అబ్బాయిని ఇండియాకు తరిమేస్తే, అక్కడ అతను జీవితం విలువను ఎలా తెలుసుకున్నాడనేది కథాంశం. అంతేగానీ, ఆస్తి అనేది ఉండదు. ఇందులో ఫాదర్‌ సన్‌ విషయం ఉంటుంది. మధుర శ్రీధర్, యష్‌ రంగినేని, ధీరజ్‌ మొగిలినేని అందరూ చక్కటి సపోర్ట్‌ అందించారు. భరత్‌ చాలా మంచి పాత్ర చేశాడు. మంచి కెమిస్ట్రీ కుదిరింది. మా కాంబినేషన్‌ హిట్‌ కాంబినేషన్‌ అవుతుంది. నా తండ్రి పాత్రలో నాగబాబుగారు తప్ప మరెవరినీ ఊహించుకోలేను.  ఏబీసీడీ అంద‌ర్నీ ఆక‌ట్టుకోవ‌డం చాలా సంతోషాన్ని ఇచ్చింద‌న్నారు అల్లు శిరీష్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంజ‌లి న‌టించిన 3డి దెయ్యం "లీసా" సెన్సార్ రిపోర్ట్ ఏంటి.?