Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరచేతితో సూర్యుణ్ణి.. విసనకర్రతో తుఫాన్‌ను ఆపగలమా? 'ఖైదీ నం.150'కు ముహుర్తం ఖరారు!

హమ్మయ్య.. మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం "ఖైదీ నెం.150" ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌కు తలెత్తిన ఇబ్బందులు సమసిపోయాయి. ఈ నెల 7వ తేదీన గుంటూరులోని హాయ్ ల్యాండ్‌ పర్యాటక కేంద్రంలో ఈ వేడుకలు అట్టహాసంగా నిర్వహించ

Webdunia
సోమవారం, 2 జనవరి 2017 (15:20 IST)
హమ్మయ్య.. మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం "ఖైదీ నెం.150" ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌కు తలెత్తిన ఇబ్బందులు సమసిపోయాయి. ఈ నెల 7వ తేదీన గుంటూరులోని హాయ్ ల్యాండ్‌ పర్యాటక కేంద్రంలో ఈ వేడుకలు అట్టహాసంగా నిర్వహించేందుకు చిత్ర నిర్మాతలు సిద్ధమయ్యారు. 
 
వాస్తవానికి ఈ ప్రీ రిలీజ్ వేడుక ఈనెల 4వ తేదీన విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించాలని భావించారు. అయితే, ఈ స్టేడియంలో క్రీడా కార్యక్రమాలకు తప్ప ఇతర ఫంక్షన్లకు దీన్ని వినియోగించుకోరాదని గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉటంకిస్తూ అధికారులు పర్మిషన్ నిరాకరించారు. 
 
దీనిపై చిరంజీవి ఫ్యాన్స్ మండిపడ్డారు కూడా. గతంలో ఈ స్టేడియంలో ఎన్నో కార్యక్రమాలు జరిగాయని వారు గుర్తుచేశారు. కొందరు అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గిన అధికారులు ఈ పర్మిషన్ ఇవ్వలేదని ఆరోపించారు. సంక్రాంతి బరిలో నిలిచిన చిరంజీవి చిత్రాన్ని ఎదుర్కోలేక ఇలాంటి కుట్రలు పన్నారంటూ మండిపడ్డారు. అంతేనా అరచేత్తో సూర్యుణ్ణి.. విసనకర్రతో తుఫానును ఆపడటం ఎవరితరం కాదంటూ కామెంట్స్ కూడా చేశారు.  
 
ఈ నేపథ్యంలో ఈ నెల 7వ తేదీన గుంటూరులో ఈ వేడుక జరపాలని మేకర్స్ నిర్ణయించారు. దీంతో చిరు అభిమానులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. అటు సెన్సార్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న "ఖైదీ నెం.150" చిత్రం సంక్రాంతి రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. చిరంజీవి, కాజల్ అగర్వాల్ నటించిన ఈ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా, హీరో రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్, ఎందుకో తెలుసా? (video)

Telugu Compulsory: తెలుగు తప్పనిసరి- తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

ఐటీ నగరం బెంగుళూరులో రెడ్ అలెర్ట్ ... ఎందుకో తెలుసా?

Nara Lokesh: దళితులకు గుండు కొట్టించి, వారిని చంపి డోర్ డెలివరీలు చేసిన వారు మీరే! (video)

ఉపాధ్యాయురాలి హత్యకు విద్యార్థుల కుట్ర... ఎందుకు.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

మధుమేహాన్ని నిర్వహించుకుంటూ మీ గుండెను కాపాడుకోవడానికి 5 ముఖ్య సూచనలు

తర్వాతి కథనం
Show comments