Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగోడికి తెలుగోడు సవాల్... కంగనా 'మణికర్ణిక'తో బాహుబలిని బీట్ చేస్తాడా...?

బాహుబలి చిత్రం ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీ రికార్డులను బద్ధలు కొట్టే దిశగా పయనిస్తోంది. ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇపుడు ఇలాంటి హిస్టారికల్ మూవీతో మరో తెలుగోడు క్రిష్ రాబోతున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగనా రనౌ

Webdunia
శుక్రవారం, 5 మే 2017 (17:54 IST)
బాహుబలి చిత్రం ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రీ రికార్డులను బద్ధలు కొట్టే దిశగా పయనిస్తోంది. ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇపుడు ఇలాంటి హిస్టారికల్ మూవీతో మరో తెలుగోడు క్రిష్ రాబోతున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించనుండటం విశేషం. కంగనా రనౌత్ ఝాన్సీ రాణిగా క్రిష్ తెరకెక్కిస్తోన్న ‘మణికర్ణిక’ చిత్రం ఫ‌స్ట్‌లుక్‌ వారణాశిలో నిన్న రిలీజ్ చేశారు. బాహుబలి చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నేపథ్యంలో మరో తెలుగు దర్శకుడికే ఈ ప్రాజెక్టును అప్పగించడంతో బాలీవుడ్ డైరెక్టర్లు ఉడుక్కుంటున్నారని సమాచారం. 
 
మరోవైపు ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా నటి కంగనా రనౌత్, దర్శకుడు క్రిష్ ఇంకా ఇతర యూనిట్ సభ్యులు కాశీలోని ద‌శాశ్వ‌మేధ ఘాట్‌కు వెళ్లారు. అక్కడ కంగ‌నా ర‌నౌత్‌ గంగాన‌దిలో పుణ్యస్నాన‌మాచ‌రించింది. కాశీ విశ్వనాథుని దర్శించుకున్న కంగనా తన మణికర్ణిక లుక్‌ను రిలీజ్ చేసింది. ఝాన్సీ లక్ష్మీభాయ్ తిరిగిన ప్రాంతాలను సందర్శించనున్నట్లు ఆమె చెప్పింది. 
 
అంతేకాదు... రాణి హావభావాలు ఎలా వుంటాయో తెలుసుకునేందుకు పరిశోధకుల వద్దకు కూడా వెళ్లనున్నట్లు తెలియజేసింది. మరోవైపు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాలని క్రిష్ సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే బాహుబలి 1000 కోట్ల వసూళ్ల దిశగా పయనిస్తుండగా, వచ్చే ఏప్రిల్ నాటికి విడుదలయ్యే మణికర్ణిక ఎంతమేరకు వసూళ్లు రాబడుతుందో చూడాల్సి వుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh Meets PM: ఢిల్లీలో ప్రధానిని కలిసిన నారా లోకేష్ ఫ్యామిలీ

Duvvada Srinivas: దివ్వెల మాధురితో దువ్వాడ శ్రీనివాస్ నిశ్చితార్థం.. ఉంగరాలు తొడిగారుగా! (video)

జమ్మూలో బాధ్యతలు.. సిద్ధిపేటలో భూ వివాదం... జవానుకు కష్టాలు.. తీరేదెలా?

పాకిస్తాన్‌కు సైనిక సమాచారం చేరవేసిన యూ ట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్

IMD: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments