నా గోవిందా నాకే సొంతం విడాకులపై భార్య స్పందన

ఠాగూర్
గురువారం, 28 ఆగస్టు 2025 (15:55 IST)
బాలీవుడ్ నటుడు గోవిందా, ఆయన భార్య సునీత అహుజాలు విడాకులు తీసుకున్నారంటూ గత కొన్ని రోజులుగా విస్తృతంగా ప్రచారం సాగుతోంది. దీనిపై సునీత ఎట్టకేలకు స్పందిచారు. నా గోవిందా నాకే సొంతం అంటూ స్పష్టం చేశారు. పైగా, వినాయక చవితి వేడుకల్లో భార్యాభర్తలిద్దరూ కలిసి పాల్గొని, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఈ గణేశ ఉత్సవాల్లో వారిద్దరూ సంప్రదాయ దుస్తుల్లో మెరిసి, తమ విడాకులపై వస్తున్న పుకార్లను తీవ్రంగా ఖండించారు.
 
ఈ సందర్భంగా సునీత మీడియాతో మాట్లాడుతూ, మీరు గణపతి కోసం వచ్చారా? లేకా మా వివాదం కోసం వచ్చారా? అంటూ మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. మమ్మల్లి ఇంత దగ్గరగా చూశాక కూడా మీకు అనుమానాలు ఉన్నాయా?, మా మధ్య ఏమైనా తేడాలు ఉన్నాయా?, అలా ఉంటే ఇలా కలిసి ఉండేవాళ్లం కాదు. దేవుడు గానీ, దెయ్యంగానీ మమ్మల్ని విడదీయలేవు. నా భర్త నాకే  సొంతం. నా గోవిందా నాకే సొంతం. దయచేసి ఎవరూ ఈ పుకార్లను నమ్మవద్దు. మేం స్వయంగా చెబితే తప్ప దేనినీ విశ్వసించకండి అని ఆమె స్పష్టం చేశారు. కాగా, సునీత విడాకుల కోసం బాంద్రా ఫ్యామిలీ కోర్టులో పత్రాలు దాఖలు చేశారనే విషయం బయటకురావడంతో ఈ వివాదం మొదలైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: అమరావతి రెండవ దశ భూ సేకరణకు ఆమోదం

Live Cockroach in Heart: గుండెలో బతికే వున్న బొద్దింక.. అమెరికాకు వెళ్లిన పెద్దాయన.. ఎందుకు?

పరకామణి దొంగతనం కేసు.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నివేదికను సమర్పించిన సిట్

పెట్టుబడుల కోసం అమెరికాలో పర్యటించనున్న నారా లోకేష్

అత్తగారింట్లో అడుగుపెట్టిన అర గంటకే విడాకులు - కట్నకానుకలు తిరిగి అప్పగింత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments