Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవిందా, శిల్పాశెట్టి కోర్టుకు హాజరు కావాల్సిందే: పాకూర్ కోర్టు

1996లో విడుదలైన 'ఛోటే సర్కార్' చిత్రంలో గోవిందా, శిల్పాశెట్టిల జంట కలసి నటించగా, బీహార్, యూపీలను కించపరుస్తూ, ఇందులో ఓ పాటను చిత్రీకరించారని ఓ న్యాయవాది కోర్టులో కేసు వేశారు. రెండు దశాబ్దాల నాటి కేసుల

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2016 (15:17 IST)
1996లో విడుదలైన 'ఛోటే సర్కార్' చిత్రంలో గోవిందా, శిల్పాశెట్టిల జంట కలసి నటించగా, బీహార్, యూపీలను కించపరుస్తూ, ఇందులో ఓ పాటను చిత్రీకరించారని ఓ న్యాయవాది కోర్టులో కేసు వేశారు. రెండు దశాబ్దాల నాటి కేసులో ఈ నెల 18న కోర్టుకు హాజరు కావాల్సిందేననంటూ జార్ఖండ్‌లోని పాకూర్ కోర్టు నటుడు గోవిందా, నటి శిల్పాశెట్టిలను ఆదేశించింది.  
 
హీరో హీరోయిన్లతో పాటు పాట పాడిన గాయకుడు, దర్శకులపైనా కేసు వేశారు. ఆ తర్వాత బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినా కేసు ఏళ్ల తరబడి వాయిదాలపై వాయిదాలతో సాగింది. ఎన్నిసార్లు కోర్టు ఆదేశించినా చిత్రానికి సంబంధించిన ఎవరూ కోర్టుకు రాలేదు. దీంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పాకూర్ కోర్టు న్యాయమూర్తి, వీరిని తీసుకురావాల్సిందేనని ముంబై పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
 
ఇటీవలే శిల్పాశెట్టి తండ్రి సురేంద్ర శెట్టి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మంచి వ్యాపారవేత్తగా పేరు పొందారు. ట్యాంపర్ ప్రూఫ్ వాటర్ క్యాప్స్ తయారు చేసే వ్యాపారంలో ఉన్నారు. శిల్పాశెట్టి తండ్రి మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తండ్రి మరణించిన కొద్దిరోజులకే కేసులతో తలనొప్పి రావడంపై శిల్పాశెట్టి తలపట్టుకుని కూర్చుంది. ఇప్పటికే ఐపీఎల్ ఫిక్సింగ్ వ్యవహారంలో శిల్పాశెట్టి భర్త అభియోగాలు ఎదుర్కొన్నారు. తాజాగా సినిమా పాటతో శిల్పాశెట్ట ివివాదంలో చిక్కుకుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కార్తీక పౌర్ణమి రోజున గుండెపోటుతో 12 ఏళ్ల బాలిక మృతి.. ఎక్కడ?

ఆ శ్రీరెడ్డి, బోరుగడ్డ ఎవరసలు?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న (video)

విశాఖలో ఎన్టీపీసీ ఉత్పత్తి కేంద్రం.. 29న ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన

రక్త పింజర కాటేసింది.. పరుగెత్తి పట్టుకున్నాడు.. చంపి కవర్లో వేసుకుని?

చెన్నైలో రూ.3 కోట్ల విలువ చేసే ఏనుగు దంతాల బొమ్మలు స్వాధీనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments