Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్యామిలీని ఆకట్టుకోనున్న గోపీచంద్, శ్రీవాస్ ల రామబాణం

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (10:24 IST)
కొన్ని కాంబినేషన్ లు గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. అందులో దర్శకుడు శ్రీవాస్, హీరో గోపీచంద్ కాంబినేషన్ ఒకటి. గోపిచంద్ నటించిన లక్ష్యం సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన శ్రీవాస్ తన మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు.ఆ తరువాత చేసిన రామ రామ కృష్ణ కృష్ణ, పాండవులు పాండవులు తుమ్మెద, లౌక్యం, డిక్టేటర్ వంటి సినిమాలు శ్రీవాస్ కి హిట్ దర్శకుడిగా పేరును తీసుకొచ్చాయి. 
 
దర్శకుడిగా శ్రీవాస్ ఎన్ని హిట్ సినిమాలను చేసిన లక్ష్యం, లౌక్యం సినిమాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ రెండు సినిమాలలో హీరో గోపిచంద్ కావడం, రెండు మంచి హిట్ టాక్ ను సాధించడం విశేషం. ప్రస్తుతం వీరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం రామబాణం. ఇదివరకే దీనికి సంబంధించిన టైటిల్‌ పోస్టర్‌ ను రిలీజ్‌ చేశారు.హ్యాట్రిక్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం పై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. 
 
మహా శివరాత్రి కానుకగా తాజాగా ఈ చిత్రం నుండి ఫస్ట్ యారో అంటూ ఒక వీడియోను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ 49 సెకన్స్ నిడివి గల ఈ వీడియోలో కంప్లీట్ కమర్షియల్ హంగులతో
పాటు కొంచెం ఫ్యామిలీ టచ్ కూడా ఉండబోతుంది అని అర్ధమవుతుంది. మంచి హిట్ హిట్ సినిమాలను తెరకెక్కించిన శ్రీవాస్ ఈ రామబాణం సినిమాతో బాక్స్ ఆఫీస్ గురి తప్పదని అర్ధమవుతుంది.   
 
కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు,ఒక సోషల్ ఇష్యూను టచ్ చేస్తూ ఈ సినిమా కథ సాగుతుంది అని సమాచారం వినిపిస్తుంది. ఈ హ్యాట్రిక్ కాంబినేషన్ చిత్రాన్ని పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ పై టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో గోపిచంద్ సరసన డింపుల్‌ హయాతీ హీరోయిన్‌ గా చేస్తోంది.రెండు హిట్ చిత్రాలను గోపీచంద్ కెరియర్ కి అందించిన శ్రీవాస్ ఇప్పుడు మూడో సినిమాతో హ్యాట్రిక్ హిట్ ను అందించనున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శబరిమలలో అయ్యప్ప భక్తుడు ఆత్మహత్య.. అక్కడ నుంచి దూకేశాడు.. (video)

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments