మా తాత నాతోనే ఉన్నారు: దగ్గుబాటి అభిరాం

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (10:18 IST)
Ramanaidu vigram,abiram
మూవీ మొఘల్ గా, తెలుగులో అత్యధిక సినిమాలు చేసి, అనేక ఇతర భాషల్లో కూడా సినిమాలు చేసిన నిర్మాతగా పేరు తెచ్చుకున్న రామానాయుడు వర్ధంతి సందర్భంగా ఆయన చిన్న మనవడు దగ్గుబాటి అభిరామ్ ఫిలిం ఛాంబర్ వద్ద ఉన్న దగ్గుబాటి రామానాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియ‌ర్ టాలీవుడ్ నిర్మాత‌, ఛాంబ‌ర్ కార్య‌ద‌ర్శి తుమ్మ‌ల ప్ర‌స‌న్న‌కుమార్, నిర్మాత కం ఫిలిం జర్నలిస్ట్ సురేష్ కొండేటి, నిర్మాత బాలరాజు, నిర్మాత అంకమ్మరావు  పాల్గొన్నారు.
 
తనకు ఎంతో ఆప్తులైన తాతయ్యకు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన తర్వాత దగ్గుబాటి అభిరామ్ మాట్లాడుతూ ‘’అందరికీ నమస్కారం ఈరోజు తాత గారి తొమ్మిదవ వర్ధంతి అయితే నాకు ఆయన దూరమయ్యారని ఇప్పటికి అనిపించడం లేదు. ఈ రోజుకి ఆయన నాతోనే ఉన్నారు అనిపిస్తూ ఉంటుంది. ప్రతిరోజు ఆయనను చూస్తున్నట్లే అనిపిస్తూ ఉంటుంది, నాకు చిన్నప్పటి నుంచి ఆయనే లోకం నన్ను హీరోగా చూడాలని ఆయన ఎంతో తపించారు, తాత నీ కలను నేను సాధించాను, నీ ఆశీర్వాదం కావాలి, నేను మీరు గర్వపడేలా చేస్తాను. నాకు మాటలు రావడం లేదు. ఆయన గురించి తలుచుకుంటేనే కన్నీరు ఊబికి వస్తోంది. ఆయనంటే నాకు అంత ప్రేమ. వీరంతా చెప్పినట్లు ఆయన ఎక్కడో లేరు, ఫిలిం ఛాంబర్ చుట్టూ స్టూడియో చుట్టూనే ఆయన తిరుగుతూ ఉంటారని నమ్ముతున్నాను. ఆయన ఎక్కడ ఉన్నా ఆయన పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జార్ఖండ్‌లో ఘోరం.. భార్య మద్యం సేవించి వచ్చిందని భర్త దాడి.. తీవ్రగాయాలతో మృతి

ప్రియురాలిని చంపి సూట్‌కేసులో కుక్కి... కాలువలో పడేశాడు...

Mock Assembly in Amaravati: విద్యార్థులతో మాక్ అసెంబ్లీ.. హాజరైన చంద్రబాబు, నారా లోకేష్ (video)

అర్థరాత్రి రాపిడో బ్రేక్ డౌన్... యువతి కంగారు... ఆ కెప్టెన్ ఏం చేశారంటే....

ఓటు హక్కును వినియోగించుకోవడం మన కర్తవ్యం : ప్రధాని నరేంద్ర మోడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం
Show comments