తక్కువ బడ్జెట్‌తో రూపొంది నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్స్‌కు మంచి లాభాలను అందించిన సంచలన చిత్రం గూఢచారి. అడివి శేష్ - శోభిత ధూళిపాల జంటగా నూతన దర్శకుడు శశి కిరణ్ తిక్క ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ నేటికీ హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో
తక్కువ బడ్జెట్‌తో రూపొంది నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్స్‌కు మంచి లాభాలను అందించిన సంచలన చిత్రం గూఢచారి. అడివి శేష్ - శోభిత ధూళిపాల జంటగా నూతన దర్శకుడు శశి కిరణ్ తిక్క ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ నేటికీ హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో సక్సస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. కింగ్ నాగార్జున సైతం ఈ మూవీ టీమ్‌ని అభినందించిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలో సైతం రికార్డు స్ధాయి కలెక్షన్స్ వసూలు చేస్తోంది. ఈ సందర్భంగా గూఢచారి టీమ్ అమెరికాలో సక్సస్ టూర్ ప్లాన్ చేసింది.
ఈ చిత్రం యుఎస్ఎలో $ 700K క్రాస్ చేసింది. దీంతో ఈ నెల 17 నుంచి 26 వరకు యుఎస్ఎలో గూఢచారి టీమ్ ప్రేక్షకులను కలవనున్నారు. 17న సీయెటెల్, 18న చికాగో, 19న బే ఏరియా, 24న డల్లాస్, 25న డెట్రాయిట్, 26న న్యూజెర్సీలో గూఢచారి ప్రదర్శించే థియేటర్స్ లో ప్రేక్షకులను కలుసుకోనున్నారని టీమ్ ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. ఈ సినిమా ఇచ్చిన విజయంతో గూఢచారి 2 కూడా తీసేందుకు ప్లాన్ చేస్తున్నారు.