Webdunia - Bharat's app for daily news and videos

Install App

''శివగామి'' పేరిట వెబ్‌సిరీస్.. రాజమౌళి పర్యవేక్షణలో దేవ్ కట్టా?

దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 1, బాహుబలి 2 ది కంక్లూజన్ సినిమాలు తెలుగు ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తెలియజేశాయి. కలెక్షన్స్ పరంగా బాహుబలి భారత బాక్సాఫీసును షేక్ చేసిన సంగతి తెలిసిందే.

Webdunia
గురువారం, 5 జులై 2018 (12:11 IST)
దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 1, బాహుబలి 2 ది కంక్లూజన్ సినిమాలు తెలుగు ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తెలియజేశాయి. కలెక్షన్స్ పరంగా బాహుబలి భారత బాక్సాఫీసును షేక్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ''బాహుబలి'' ప్రీక్వెల్‌గా శివగామి వెబ్‌సిరీస్‌‌ను తెరకెక్కించనున్నారు. 
 
బాహుబలి సినిమాలో శివగామి పాత్రకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. హీరోహీరోయిన్ల మధ్య కీలకంగా నిలిచిన శివగామి పాత్ర ప్రేక్షకులను ప్రభావితం చేసింది. అందుకే శివగామి పాత్ర పేరుతో ఓ వెబ్ సిరీస్‌ను రూపొందించేందుకు నెట్ ఫ్లిక్స్ సంస్థ సన్నాహాలు ప్రారంభించింది. ఇందుకోసం రూ.375 కోట్లను కేటాయించినట్టుగా తెలుస్తోంది. 
 
మాహిష్మతి సామ్రాజ్య విస్తరణలో 'శివగామి' ఎలాంటి పాత్రను పోషించిందనే విషయం చుట్టూనే ప్రధాన కథ తిరుగుతుందని సమాచారం. త్వరలోనే ఈ వెబ్ సిరీస్‌కు నటీనటుల ఎంపిక జరుగనుంది. ఈ వెబ్‌సిరీస్‌కి దేవ్ కట్టా దర్శకుడిగా వ్యవహరించనున్నాడనీ, రాజమౌళి పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టు కొనసాగుతుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. 
 
ఇకపోతే.. బాహుబలి సిరీస్‌లో సత్యరాజ్ కట్టప్పగా, రమ్యకృష్ణ శివగామిగా, రానా దగ్గుబాటి భల్లాలదేవుడిగా, ప్రభాస్ శివుడు, బాహుబలిగా, అనుష్క శెట్టి దేవసేనగా, తమన్నా అవంతికగా కనిపించిన సంగతి తెలిసిందే. మరి శివగామి వెబ్‌సిరీస్‌లో ఈ పాత్రల్లో ఎవరెవరు కనిపిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments