Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే సెట్‌లో 'అన్నయ్య - తమ్ముడు' - 'భీమ్లా నాయక్‌'కు ఆల్ ది బెస్ట్

Webdunia
గురువారం, 24 ఫిబ్రవరి 2022 (13:30 IST)
తెలుగు చిత్రపరిశ్రమలోని హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లు అన్నాదమ్ములు. వీరిద్దరూ చాలా అరుదుగా ఒక చోట కనిపిస్తుంటారు. మరీ ముఖ్యంగా, షూటింగ్ సెట్‌లలో ఇద్దరినీ ఒకేసారి చూసిన సందర్భాలు చాలా తక్కువ. అయితే, తాజాగా ఇద్దరు అన్నాదమ్ములు ఒకే ఫ్రేములో కనిపించారు. ఈ వీడియోను మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కోసం రిలీజ్ చేశారు. 
 
"గాడ్ ఫాదర్" షూటింగ్‌లో బిజిగా ఉన్న మెగాస్టార్ చిర్ంజీవి, "భీమ్లా నాయక్" సెట్‌ను సందర్శించి తన సోదరుడు పవన్ కళ్యాణ్ బృందంతో గడిపిన ఆనందకరమైన క్షణాలను పంచుకున్న వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. 
 
టీమ్ "గాడ్ ఫాదర్" నుంచి "భీమ్లా నాయక్‌"కు ఆల్ ది బెస్ట్ చెప్పే క్యాప్షన్‌తో వీడియో ముగిసింది. ఈ వీడియోలో చిరంజీవి ఖైదీ దుస్తుల్లో కనిపించారు. పవన్ మాత్రం పోలీస్ దుస్తుల్లో ఉన్నారు. ఇక "భీమ్లా నాయక్‌" బృందంలో దగ్గుబాటి రానా కూడా ఉండటం గమనార్హం. 
కాగా, 'భీమ్లా నాయక్' ఈ నెల 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా, నిత్యా మీనన్, సంయుక్తా మీనన్‌లు హీరోయిన్లుగా నటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. ఎస్ఎస్.థమన్ సంగీతం. సితార ఎంటర్‌టైన్మెంట్ పతాకంపా నిర్మించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: తమిళనాడులో జనసేన ఏర్పాటు.. స్టాలిన్‌ను కొనియాడిన పవన్ కల్యాణ్

రాళ్లతో కొడతానంటే ప్రశ్నపత్రం చూపించాను... వాళ్లు ఫోటో తీసుకున్నారు : విద్యార్థిని

మాజీ స్పీకర్ తమ్మినేని డిగ్రీ సర్టిఫికేట్.. నకిలీదా.. విచారణ జరపండి..!!

ఏపీలో 4 రోజుల పాటు వడగళ్ల వర్షం ... ఈదురు గాలులు వీచే అవకాశం... ఐఎండీ

Lawyer: హైదరాబాదులో దారుణం: అడ్వకేట్‌ను కత్తితో దాడి చేసి హత్య- డాడీని అలా చేశారు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments