జెట్టి విజువల్స్ ఆశ్చర్య పరిచాయి: దర్శకుడు మలినేని గోపిచంద్

Webdunia
గురువారం, 3 నవంబరు 2022 (16:13 IST)
Getty team with Malineni Gopichand
వర్ధిన్ ప్రోడక్షన్స్ బ్యానర్‌పై వేణు మాధవ్ కే నిర్మాతగా, సుబ్రమణ్యం పిచ్చుక దర్శకత్వంలో రూపొందిన చిత్రం జెట్టి. మాన్యం కృష్ణ, నందితా శ్వేత జంటగా, శివాజీ రాజా, కన్నడ కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబర్ 4వ తేదీన రిలీజ్ అవుతున్నది.  జెట్టి మూవీ ట్రైలర్ ని సక్సెస్ పుల్ దర్శకుడు మలినేని గోపీచంద్ వీరసింహారెడ్డి సెట్స్ లో లాంఛ్ చేసారు. 
 
ఈ సందర్భంగా దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ: జెట్టి ట్రైలర్ లో కొన్ని విజువల్స్ నన్ను ఆశ్చర్య పరిచాయి. చాలా రియలిస్టిక్ అప్రోచ్ తో మత్య్సకారుల జీవితాలను తెరమీదకు తెచ్చిన విధానం బాగుంది.  ఈ కథలో మట్టివాసనలు తెలుస్తున్నాయి. వీరి ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. పాటలు కూడా మంచి విజయం సాధించాయి అని తెలసింది. ఈ సినిమాతో పరిచయం అవుతన్న హీరో కృష్ణకు దర్శకుడు సుబ్రమణ్యం పిచ్చుకకు నా అభినందనలు అన్నారు.
 
హీరో మాన్యం కృష్ణ మాట్లాడుతూ: మా ట్రైలర్ ని లాంఛ్ చేసిన దర్శకుడు గోపీచంద్ మలినేని గారికి థ్యాంక్స్.  చాలా కొత్త నేపథ్యం లో ఈ సినిమా ఉంటుంది.  దూరం కరిగినా సాంగ్ మా సినిమాకు మంచి హైప్ ని తెచ్చింది.  మత్య్స కారుల జీవితాలను ఆవిష్కరించిన ఈ సినిమా లో అందమైన ప్రేమకథతో పాటు తండ్రి కూతుళ్ళ మద్య బలమైన ఎమోషన్స్ ఉంటాయి. నందిత శ్వేత గారితో కలసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది.  దర్శకుడు సుబ్రమణ్యం పిచ్చుక ఈ కథను మలిచిన తీరు చాలా హృద్యంగా ఉంటుంది అన్నారు..
 
దర్శకుడు సుబ్రమణ్యం పిచ్చుక మాట్లాడుతూ: తీర ప్రాంతం లో ఒక జీవిన విధానం ఉంటుంది. వారి సమస్యలు కట్టుబాట్లు చాలా పటిష్టంగా ఉంటాయి.  అలాంటి నేపథ్యం లో తీసిన జెట్టి కథ తప్పకుండా ప్రేక్షకులకు కొత్త ఎక్స్ పీరియన్స్ ని అందింస్తుంది.  తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ లభిస్తుందని నమ్ముతున్నాను. మా సినిమా ట్రైలర్ ని లాంఛ్ చేసిన దర్శకుడు గోపీచంద్ మలినేని కి థ్యాంక్స్.  అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డిసెంబరులో అమెరికా పర్యటనలో నారా లోకేష్.. పెట్టుబడుల కోసం ఎన్నారైలతో?

జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు : తితిదే వెల్లడి

పరకామణి చోరీ కేసులో ఇరికించేందుకు దుష్టచతుష్టయం కుట్ర : భూమన

ఏపీలో కొత్తగా మరో రెండు జిల్లాలు.. రంపచోడవరం కూడా పరిశీలన

Gram Panchayats Polls: తెలంగాణలో డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments