Webdunia - Bharat's app for daily news and videos

Install App

''గౌతమీపుత్ర శాతకర్ణి'' ఫస్ట్ లుక్ రిలీజ్.. దసరాకు నందమూరి ఫ్యాన్స్‌కు పండగే పండగ

నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఫస్ట్ లుక్ రిలీజ్ దసరాకు రిలీజ్ కానుంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో బాలకృష్ణ, హేమ మాలిని, శ్రియ శరన్‌‌లపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్న సంగతి తె

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2016 (11:24 IST)
నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఫస్ట్ లుక్ రిలీజ్ దసరాకు రిలీజ్ కానుంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో బాలకృష్ణ, హేమ మాలిని, శ్రియ శరన్‌‌లపై కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్న సంగతి తెల్సిందే. ఈ చిత్రం  నందమూరి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న నేపథ్యంలో డైరెక్టర్ క్రిష్ మొదటి టీజర్‌తో వారి అంచనాలను రెట్టింపు చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇందులో భాగంగా దసరాకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి నందమూరి అభిమానులు దసరా పండగను మరింత జోరుగా జరుపుకునేట్టు చేయనున్నారు. 
 
ఇకపోతే.. రెండవ శతాబ్దపు రాజు గౌతమీపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా ఈ చిత్రంతెరకెక్కతోంది. బాలకృష్ణ తల్లిగా హేమ మాలిని నటిస్తుండగా, శ్రియ విశిష్టి దేవి పాత్రలో బాలకృష్ణకు భార్యగా నటించనుంది. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 2017 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. మరి ఫస్ట్ లుక్‌లో బాలయ్య ఎలా ఉండబోతున్నాడో చూడాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments