Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గరుడవేగ' విజయోత్సవంలో హీరో రాజశేఖర్ ఫ్యామిలీ.. యాక్సిడెంట్ చేసిన శివాని

హీరో రాజశేఖర్ - జీవితల పెద్ద కుమార్తె శివాని ఓ కారు ప్రమాదానికి కారణమైంది. ఆమె నడుపుతున్న ఏపీ 13ఈ 1234 నెంబర్ కారు జూబ్లీహిల్స్‌ రోడ్డోలోని ఓ స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపు తప్పి, రోడ్డు పక్క ఆగి ఉన్న మరో

Webdunia
ఆదివారం, 5 నవంబరు 2017 (08:59 IST)
హీరో రాజశేఖర్ - జీవితల పెద్ద కుమార్తె శివాని ఓ కారు ప్రమాదానికి కారణమైంది. ఆమె నడుపుతున్న ఏపీ 13ఈ 1234 నెంబర్ కారు జూబ్లీహిల్స్‌ రోడ్డోలోని ఓ స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపు తప్పి, రోడ్డు పక్క ఆగి ఉన్న మరో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాధితుని కారు పాక్షికంగా దెబ్బతింది. ఈ ఘటనలో ఎవ్వరికీ గాయాలుకాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 
 
కాగా, ఇటీవలే 30 లక్షల రూపాయలతో కొత్త కారును కొనుగోలు చేశామనీ, ఇపుడు రాజశేఖర్ కుమార్తె కారుతో ఢీకొట్టడం వల్ల కారు బాగా దెబ్బతిందని, అందువల్ల రూ.30 లక్షలు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ప్రమాదానికి సంబంధించి హైదరాబాద్ నగర పోలీసులు కేసు నమోదు చేయలేదు. 
 
మరోవైపు.. రాజశేఖర్ హీరోగా నటించిన "గరుడవేగ" చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం హిట్ అయింది. ఈ విజయోత్సవంలో హీరో రాజశేఖర్ కుటుంబ సభ్యులు మునిగిపోయారు. అందువల్లే రాజశేఖర్ కుటుంబ సభ్యులకు రోడ్డు కనిపించడం లేదంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. శివాని ప్రస్తుతం మెడిసిన్ చదువుతున్నారు. త్వరలో ఆమె హీరోయిన్‌గా తెరంగేట్రం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బోరుగడ్డకు రాజమండ్రి సెంట్రల్ జైలు సిబ్బంది దాసోహమయ్యారా?

ఆదిలాబాద్: గిరిజన ఆశ్రమ పాఠశాలలో బాలిక అనుమానాస్పద మృతి.. 15 నెలల్లో 83 మంది? (video)

కరేబియన్ దీవులకు వివాహర యాత్రకు వెళ్లిన భారత సంతతి విద్యార్థి మాయం!

SLBC Tunnel: కేరళ నుంచి అవి వచ్చాయ్.. రెండు మృతదేహాల గుర్తింపు

జామా మసీదు సమీపంలో అల్లర్లు - బలగాల మొహరింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

తర్వాతి కథనం
Show comments