Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వాతిముత్యం-గా గణేష్ బెల్లంకొండ

Webdunia
మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (13:02 IST)
Ganesh bellamkonda
క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన 'స్వాతిముత్యం` టైటిల్‌తో ప్ర‌ముఖ  నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండో కుమారుడు గణేష్ బెల్లంకొండ క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన హీరో స్టిల్‌ను మంగ‌ళ‌వారంనాడు చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.
 
ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్ టైన్మెంట్స్ ప‌తాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'స్వాతిముత్యం' అనే పేరును నిర్ణయించారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన చేస్తూ రూపొందించిన ప్రచార చిత్రంను కూడా విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రంలో కథానాయకుడు గణేష్ భుజాన బ్యాగ్ తో ఉండటం కనిపిస్తుంది.ఆకర్షణీయమైన లోగో తో కూడిన చిత్రం పేరు కనిపిస్తుంది. ఈరోజు చిత్ర కథానాయకుడు పుట్టినరోజు. ప్రచార చిత్రంలో ఈ విషయాన్ని కూడా గమనించవచ్చు.
 
'వర్ష బొల్లమ్మ' ఈ చిత్ర కధానాయిక. లక్ష్మణ్.కె.కృష్ణ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయన మాటల్లో చెప్పాలంటే 'స్వాతిముత్యం' లాంటి ఓ యువకుడు కథే ఈ చిత్రం. జీవితం, ప్రేమ, పెళ్లి పట్ల, ఆలోచనలు, అభిప్రాయాలు నడుమ అతని జీవిత ప్రయాణం ఎలా సాగిందన్నది ఈ చిత్రం. కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు తప్పనిసరి. ప్రధానంగా ఇవన్నీ వినోదాన్ని పుష్కలంగా పంచుతాయి. సగటు సినిమా ప్రేక్షకుడిని అలరిస్తాయి.  ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపు కుంటున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో పూర్తి కానుంది. మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు నిర్మాత సూర్య దేవర నాగవంశీ.
 
ఇతరపాత్రల్లో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద నటిస్తున్నారు. 
సంగీతం: మహతి స్వర సాగర్, ఛాయా గ్రహణం: సూర్య, ఎడిటర్: నవీన్ నూలి, కళ: అవినాష్ కొల్ల.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాక్ గడ్డపై నుంచి ఇజ్రాయేల్‌పై మరోమారు దాడికి ఇరాన్ ప్లాన్

ద్వారకా తిరుమలలో పర్యటించనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్

చట్టాన్ని ఉల్లంఘించిన వారికి ఖచ్చితంగా సినిమా చూపిస్తాం : మంత్రి నారా లోకేశ్

ఏపీలో నేటి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ పథకం అమలు

నేటి నుంచి ట్రైన్ టిక్కెట్ బుకింగ్‌లో మార్పులు.. క్రెడిట్ కార్డులకు కొత్త నిబంధనలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

ఎముక పుష్టి కోసం ఇవి తినాలి, ఇలా చేయాలి

తర్వాతి కథనం
Show comments