Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుకున్నది ఒకటి జరిగేది ఒకటి. అదే ఈ గేమ్ ఆన్ : శుభలేఖ సుధాకర్

డీవీ
మంగళవారం, 30 జనవరి 2024 (15:54 IST)
game on prerelease
గీతానంద్, నేహా సోలంకి జంట‌గా న‌టించిన  గేమ్ ఆన్ చిత్రానికి దయానంద్ దర్శకత్వం వహించారు. ర‌వి క‌స్తూరి నిర్మించారు. మధుబాల, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఫిబ్రవ‌రి 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సంద‌ర్భంగా హైదరాబాద్‌లో ప్రీ గేమ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
 
ఈ సందర్భంగా వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ.. "ఈ సినిమా నేను చూశాను. మంచి కాన్సెప్ట్ తో చాలా బాగా తీశారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా" అని అన్నారు.
 
 శివ బాలాజీ మాట్లాడుతూ.."నేను ఇండస్ట్రీకి రావడానికి మూల కారణం హీరో, డైరెక్టర్ నాన్న కుమార్ గారే కారణం. వీళ్ళిద్దరినీ నేను చిన్నప్పటినుంచి చూస్తున్నాను. దయానంద్ ఫస్ట్ టైం డైరెక్షన్ చేసినట్టు అనిపించలేదు.  ఎంతో అనుభవం ఉన్నవాడిలా ప్రతి విషయాన్ని డీటెయిల్ గా చూపించాడు. గీతానంద్ పేరు వెనుక  కూడా ఒక స్టోరీ ఉంది. గీతా ఆర్ట్స్ సంస్థను చూసి ఆయనకు వాళ్ళ నాన్న ఈ పేరు పెట్టారు. గీత ఆర్ట్స్ ఎంత సక్సెస్ అయిందో గీతానంద్ కూడా సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతాడని నమ్మకం ఉంది. నేహా సోలంకి బాగా నటించింది. టెక్నీషియన్స్ పరంగా కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్ అందరూ బెస్ట్ ఇచ్చారు. ఫిబ్రవరి 2న రిలీజ్ అవుతున్న ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్" అని చెప్పారు.
 
హీరో గీతానంద్ మాట్లాడుతూ.."ఇది చాలా యూనిక్ కాన్సెప్ట్. ఇలాంటి కాన్సెప్ట్ ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో రాలేదు. రియల్ టైంలో సాగే  సైకలాజికల్ గేమ్ అందర్నీ ఆకట్టుకుంటుంది. సౌండ్,  ట్విస్టులు,  విజువల్స్ అన్ని చాలా కొత్తగా ఉంటాయి. ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. నిర్మాత రవి నాకు  క్లోజ్ ఫ్రెండ్. చాలా క్వాలిటీగా ఈ చిత్రాన్ని నిర్మించాడు. తను నిర్మాతగా మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. మా తమ్ముడు దయానంద్ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశాడు. కమలహాసన్ విక్రమ్ సినిమాలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్  గురించి ఎలా మాట్లాడుకున్నారో ఇందులో కూడా అలాంటి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ని అభిషేక్ అందించాడు అని చెప్పారు.
 
శుభలేఖ సుధాకర్ మాట్లాడుతూ ‘పుట్టిన దగ్గర్నుంచీ చనిపోయే వరకు ప్రతి ఒక్కరూ  ఏదో ఒక సందర్భంలో ఒక గేమ్ ఆడుతూనే ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో మనం అనుకున్నది ఒకటి.. జరిగేది ఒకటి. అలాంటి చిత్రమే ఈ ‘గేమ్ ఆన్’. ఇందులో నేను చాలా మంచి పాత్ర పోషించాను. యంగ్‌స్టర్స్ అంతా కలిసి ఈ చిత్రాన్ని రూపొందించారు. వాళ్లకున్న విజన్‌కు, డెడికేషన్‌కు హ్యాట్సాఫ్. ప్రతి ఒక్కరికీ నచ్చేలా సినిమా ఉంటుంది’ అని చెప్పారు.  
 
డైరెక్టర్ దయానంద్ మాట్లాడుతూ, ఈ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్క్రీన్ ప్లే, విజువల్స్ మ్యూజిక్ పరంగా అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నాం. మా ప్రొడ్యూసర్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు.  ఈ సినిమాను ప్రేక్షకులు గెలిపిస్తారని నమ్ముతున్నాం" అని అన్నారు.  
 నిర్మాత రవి కస్తూరి మాట్లాడుతూ, థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు చాలా ఫ్రెష్ ఫీల్ ను ఇస్తుంది. బొమ్మ బ్లాక్ బస్టర్ అమ్మ.. అందరూ రాసి పెట్టుకోండి" అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంద్రబాబు - రేవంత్ రెడ్డిలు గురుశిష్యులు కాదు : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

రిటైర్డ్ టీచర్ ఇంట్లోకి చొరబడ్డ దొంగ.. క్షమించండి.. తిరిగి ఇచ్చేస్తాను..?

బస్సు టర్నింగ్ ఇచ్చుకుంది.. మహిళ రోడ్డుపై ఎలా పడిందంటే? (Video)

అగ్నివీర్ అజయ్ కుమార్‌కి రూ.98లక్షలు ఎక్స్‌గ్రేషియా అందిందా లేదా?

బాలుడి కోసం కాన్వాయ్ ఆపిన పవన్ కల్యాణ్.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments