Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆనంద్ సినిమాలో కమలినీ ముఖర్జీ క్యారెక్టర్ లా ఉంటుంది : హీరోయిన్ అపూర్వ రావ్

డీవీ
మంగళవారం, 30 జనవరి 2024 (15:40 IST)
Apoorva Rao
యష్ పూరి హీరోగా నటించిన కొత్త సినిమా "హ్యాపీ ఎండింగ్". ఈ చిత్రంలో అపూర్వ రావ్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని హమ్స్ టెక్ ఫిలింస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల నిర్మాతలు. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహించారు. "హ్యాపీ ఎండింగ్" సినిమా ఫిబ్రవరి 2న గ్రాండ్ గా థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  ఈ సందర్భంగా సినిమా హైలైట్స్ ను లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలిపింది హీరోయిన్ అపూర్వ రావ్.
 
- మా నేటివ్ ప్లేస్ ఒంగోలు. నాన్న ఉద్యోగరీత్యా ఫ్యామిలీ గుజరాత్ షిప్ట్ అయ్యాం. నాన్న రిలయన్స్ ఆయిల్ ఇండస్ట్రీస్ లో వర్క్ చేసేవారు. నా చైల్డ్ హుడ్ గుజరాత్ లో గడిచింది. అక్కడి నుంచి కొన్నాళ్లు కువైట్ వెళ్లాం. కువైట్ లో ప్రైమరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాను. ఇండియాకు తిరిగి వచ్చాక గ్రాడ్యుయేషన్ చేసి కొంతకాలం జాబ్స్ చేశాను. జాబ్స్ ఏవీ నాకు సంతృప్తినివ్వలేదు. సినిమాల మీద ఆసక్తి ఉన్నా పేరెంట్స్, ఫ్రెండ్స్ ఎవరూ ఎంకరేజ్ చేసేవారు కాదు. 
 
కొన్నాళ్లకు యాక్టింగ్ వైపు రావాలని నిర్ణయించుకుని హైదారాబాద్ లో దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం స్కూల్ లో జాయిన్ అయి ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ టైమ్ లో పరిచయమైన కొందరు అసిస్టెంట్ డైరెక్టర్స్, వారి కామన్ ఫ్రెండ్స్ ద్వారా "హ్యాపీ ఎండింగ్" సినిమా ఆడిషన్స్ కు పిలిచారు. తెలుగు బాగా మాట్లాడే అమ్మాయి కావాలి, బాగా పర్ ఫార్మ్ చేయాలి అనేది వాళ్ల రిక్వైర్ మెంట్. నేను తెలుగుమ్మాయినే, నేను చేసిన ఆడిషన్ వాళ్లకు నచ్చి ఈ మూవీలో హీరోయిన్ గా తీసుకున్నారు. 
 
దీని కంటే ముందు చాలా సినిమాలకు ఆడిషన్ చేశాను. వాళ్లకు నా పర్ ఫార్మెన్స్ నచ్చినా డిఫరెంట్ రీజన్స్ వల్ల ఆఫర్స్ రాలేదు. "హ్యాపీ ఎండింగ్" సినిమాకు యూత్ పుల్ మూవీ అనే పేరు వచ్చింది. కానీ సినిమాలో చాలా హ్యూమర్, ఫన్ ఉంటాయి. ప్రతి పది నిమిషాలకు బాగా నవ్వుకుంటారు. మాకు ఆ విషయం తెలుసుకాబట్టి బయట సినిమా మీద ఎలాంటి ఇంప్రెషన్ ఉన్నా...టెన్షన్ పడటం లేదు. సినిమా చూసిన వాళ్లు బాగా ఎంజాయ్ చేస్తారు, ఎంటర్ టైన్ అవుతారు. ఈ మూవీలో హీరోకు ఒక ప్రాబ్లమ్ ఉంటుంది. దాని వల్ల ఆయన చేయాలనుకున్న పనులు చేయలేకపోతాడు. ఈ కాన్ ఫ్లిక్ట్ ను హీరో ఎలా ఎదుర్కొన్నాడు, అందుకు అతను చేసే ప్రయత్నాలు హ్యూమరస్ గా ఉంటాయి. ఝాన్సీ, అజయ్ ఘోష్ క్యారెక్టర్స్ కూడా చాలా ఫన్ క్రియేట్ చేస్తాయి.
 
- యష్  కు సపోర్ట్ గా నిలిచే క్యారెక్టర్ నాది. ఇందులో యోగా ఇన్ స్ట్రక్టర్ క్యారెక్టర్ లో కనిపిస్తా. యోగా టీచర్ అంటే వాళ్లు మానసికంగా బలంగా ఉంటారు. ఎదుటి వాళ్లను అర్థం చేసుకుంటారు. నా క్యారెక్టర్ ఆనంద్ సినిమాలో కమలినీ ముఖర్జీ క్యారెక్టర్ లా అనిపించింది. హీరోయిన్ గా ఫస్ట్ ఫిలింకే కథలో ఇంపార్టెన్స్ ఉన్న రోల్ లభించడం హ్యాపీగా ఉంది.
 
- మన సినిమా సెన్సిబిలిటీస్ లోనే హీరోయిన్ గా నా ప్రత్యేకత చూపించాలని కోరుకుంటున్నా. హీరోయిన్స్  శ్రీలీలను చూస్తే తను కూడా మన ఫార్మేట్ మూవీస్ లోనే డ్యాన్సెస్, పర్ ఫార్మెన్స్ తో తనకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకుంది. అలాగే  సమంత భిన్నమైన కాన్సెప్ట్స్ లు సెలెక్ట్ చేసుకుంటోంది. నేను కూడా అలా వెర్సటైల్ నటిగా పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నాను.  శేఖర్ కమ్ముల లాంటి దర్శకులతో పనిచేయాలని ఉంది. సాయి పల్లవి కెరీర్ చూస్తుంటే హీరోయిన్ గా ఇండస్ట్రీలో కంటిన్యూ అయ్యేందుకు కావాల్సిన మోటివేషన్ కలుగుతుంటుంది. అవకాశాలు వస్తే ఆమెలా కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ చేయొచ్చు అని ధైర్యం వస్తుంటుంది. నేను డ్యాన్సులు చేయగలను. చిన్నప్పుడు భరతనాట్యం నేర్చుకున్నాను. సింగింగ్ లోనూ ప్రాక్టీస్ ఉంది.
 
- "హ్యాపీ ఎండింగ్" సినిమాకు పనిచేసిన వాళ్లంతా దాదాపు కొత్త వాళ్లమే కాబట్టి చాలా అండర్ స్టాండింగ్ తో వర్క్ చేశాం. దర్శకుడు కౌశిక్ మా అందరి సజెషన్స్, ఆలోచనలు తీసుకునేవారు. అలా టీమ్ వర్క్ గా మూవీ చేశాం. ఈ సినిమాలో నా క్యారెక్టర్ కు నేనే డబ్బింగ్ చెప్పాను. మనం చేసిన క్యారెక్టర్స్ కు మన వాయిస్ ఉంటేనే బాగుంటుందని బిలీవ్ చేస్తాను. అయితే కొన్నిసార్లు చిన్మయి లాంటి వాళ్ల వాయిస్ ఆ క్యారెక్టర్స్ కు అసెట్ అవుతుంటాయి.
 
- మా మూవీకి నీతా లుల్లా గారు కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. ఆమె యష్ వాళ్ల హమ్స్ టెక్ ఇనిస్టిట్యూట్ లో గెస్ట్ లెక్చరర్ గా చెబుతుంటారు. ఈ మూవీలో యష్ న్యూ ఏజ్ మేకప్ ఆర్టిస్ట్ గా కనిపిస్తారు. కాబట్టి "హ్యాపీ ఎండింగ్" మూవీని స్టైలిష్ గా డిజైన్ చేయాలనుకున్నారు డైరెక్టర్ కౌశిక్. అందుకే నీతా లుల్లా గారిని తీసుకున్నారు.
 
- థియేటర్స్ లో ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా చూడాల్సిన సినిమా ఇది. డైలీ లైఫ్ లో ప్రెజర్ ఫీలయినవాళ్లు మా మూవీ చూస్తే రిలీఫ్ అవుతారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, వికీ డోనర్ మూవీస్ లా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. నాకు అడివి శేష్, రానా, నవీన్ పోలిశెట్టి వంటి హీరోస్ తో నటించాలని ఉంది. వాళ్ల మూవీస్ లో ఔట్ పుట్ బాగా వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒక మంచి మూవీని ప్రేక్షకుల దగ్గరకు తీసుకురావాలని ప్రయత్నిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీ భర్త వేధిస్తున్నాడా? నా కోరిక తీర్చు సరిచేస్తా: మహిళకు ఎస్.ఐ లైంగిక వేధింపులు

గూగుల్ మ్యాప్ ముగ్గురు ప్రాణాలు తీసింది... ఎలా? (video)

ప్రేయసిని కత్తితో పొడిచి నిప్పంటించాడు.. అలా పోలీసులకు చిక్కాడు..

నీమచ్‌లో 84,000 చదరపు అడుగుల మహాకాయ రంగోలి ఆసియా వరల్డ్ రికార్డు

పోసాని కృష్ణమురళి రెడ్డి అని పేరు పెట్టుకోండి: పోసానిపై నటుడు శివాజి ఆగ్రహం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments