Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చిన గాలోడు ఫ‌స్ట్ సింగిల్

Webdunia
శనివారం, 30 జులై 2022 (18:14 IST)
Sudigali Sudhir, Gehna Sippi
సుడిగాలి సుధీర్‍‍‍‍, గెహ్నా సిప్పి హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం `గాలోడు`. ప‌క్కా మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా ద‌ర్శ‌కుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్ర‌కృతి స‌మ‌ర్ప‌ణ‌లో సంస్కృతి ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్ప‌టికే విడుద‌లైన `గాలోడు` టీజ‌ర్ సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక‌ ఫ‌స్ట్ సాంగ్ ప్రోమో యూ ట్యూబ్‌లో 13 ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్ సొంతం చేసుకుని లిరిక‌ల్ సాంగ్‌పై మ‌రింత ఆస‌క్తిని క‌లిగించింది. తాజాగా `నీ కళ్లే దివాళి...` లిరిక‌ల్ వీడియోసాంగ్‌ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.
 
టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ భీమ్స్ స్వ‌ర‌ప‌రిచిన ఈ పాట ట్రెమండ‌స్ రెస్పాన్స్‌తో ఇన్‌స్టంట్‌ చార్ట్‌బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఈ పాట‌లో సుధీర్ డ్యాన్స్‌, ఫారెన్ లొకేష‌న్లు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. ప్ర‌స్తుతం ఈ పాట యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉండ‌డం విశేషం.
 
ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శకుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల మాట్లాడుతూ - ```గాలోడు` ఫ‌స్ట్ సాంగ్ ప్రోమో యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. ఇప్పుడు `నీ కళ్లే దివాళి` పాట కూడా ఇన్‌స్టంట్ హిట్ అయ్యింది. సుధీర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. భీమ్స్ అద్భుత‌మైన ట్యూన్ ఇచ్చారు. శ్రీ‌నివాస తేజ లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి. షాహిద్ మాల్య చ‌క్క‌గా ఆల‌పించాడు. యాక్షన్ అండ్‌ మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందిన `గాలోడు` సినిమా కచ్చితంగా సుధీర్ కి టర్నింగ్ పాయింట్ అవుతుంది. షూటింగ్ పూర్త‌య్యింది. ఫ‌స్ట్ సాంగ్‌తో ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేశాం. త్వ‌ర‌లోనే విడుద‌ల తేధిని ప్ర‌క‌టిస్తాం`` అన్నారు.
 
సుడిగాలి సుధీర్, గెహ్నా సిప్పి, స‌ప్త‌గిరి, పృథ్విరాజ్, శ‌క‌ల‌క శంక‌ర్‌, స‌త్య క్రిష్ణ‌  త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి
సినిమాటోగ్ర‌ఫి: సి రాం ప్ర‌సాద్‌
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: బిక్ష‌ప‌తి తుమ్మ‌ల‌
స‌మ‌ర్ప‌ణ‌: ప్రకృతి
బేన‌ర్‌: సంస్కృతి ఫిలింస్‌,
ర‌చ‌న - ద‌ర్శ‌క‌త్వం: రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల‌.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments