Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమౌళి రిలీజ్‌చేసిన `గాలిసంప‌త్` ట్రైల‌ర్‌

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2021 (17:38 IST)
Rajendra prasad, Sir vishnu
శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం `గాలి సంప‌త్`. న‌ట‌కిరీటి డా. రాజేంద్ర ‌ప్ర‌సాద్ టైటిల్ రోల్పో షిస్తున్నారు. అనిల్ చిత్రానికి స‌మ‌ర్పకుడిగా వ్యవ‌హ‌రించడంతో పాటు స్క్రీన్‌ప్లే, ద‌ర్శక‌త్వ ప‌ర్యవేక్షణ కూడా చేస్తుండ‌డం విశేషం. అనిల్ కో-డైరెక్టర్, రైట‌ర్, మిత్రుడు ఎస్. క్రిష్ణ నిర్మాత‌గా ఇమేజ్ స్పార్క్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించి షైన్ స్క్రీన్స్‌తో క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనీష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్ర‌ ట్రైలర్‌ను దర్శకధీరుడు ఎస్‌.ఎస్ రాజమౌళి విడుద‌ల చేసి టీమ్ అంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు.
 
ఈ సంద‌ర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ- `ఫ‌న్‌, ఎమోష‌న్స్, గ్రేట్ బాండింగ్స్ కంప్లీట్ ప్యాకేజ్‌. రేపు మార్చి 11న థియేటర్లలో మీరు ఏం చూడ‌బోతున్నారు అనే దానికి చిన్న స్నీక్ పీక్ ఈ ట్రైల‌ర్‌. గాలి సంప‌త్ ట్రైల‌ర్‌ని విడుద‌ల‌చేసిన రాజ‌మౌళిస‌ర్‌కి ధ‌న్య‌వాదాలు. మా టీమ్ అంతా ఎంతో సంతోషంగా ఉంది``అన్నారు.
 
ట్రైల‌ర్‌లో ఏముందంటే!
`పిల్లలు త‌ప్పు చేస్తే త‌ల్లిదండ్రులు చాలా ఓపిగ్గా ప్రేమ‌గా క‌రెక్ట్ చేస్తారు. అదేంటో కాస్త మీసాలు వ‌చ్చేస‌రికి పెద్దొళ్లు ఏం చేసినా ఊరికే చిరాకులు వ‌చ్చేస్తాయి. కోపాలు వ‌చ్చేస్తాయి. నేను కూడా మా నాన్నని కాస్త ఓపిగ్గా ప్రేమ‌గా అడ‌గాల్సింది సార్ అంటూ, సాగే ఈ ట్రైల‌ర్ ఆధ్యంతం ఆక‌ట్టుకుంటోంది. ఇందులో రాజేంద్రప్రసాద్‌ కేవలం ‘ఫిఫీ’ అనే సౌండ్‌తోనే సంభాషణలు పలకడం విశేషం. ప్ర‌తి అమ్మాయికీ డ‌బ్బున్నోడు కావాలి, లేక‌పోతే ఫారినోడు కావాలి. డ‌బ్బున్నోడు ఏం ఇస్తాడండీ? డ‌బ్బే ఇస్తాడు. టైమ్ ఎక్క‌డి నుంచి ఇస్తాడు? అంటూ శ్రీ‌విష్ణు చెప్పె డైలాగ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. `ప్రపంచంలో ఏ తండ్రైనా తన కొడుకు తనకంటే నాలుగు మెట్లు ఎదగాలని చూస్తాడు. నువ్వేంటి నాన్న నన్ను తొక్కి నువ్వు ఎద‌గాల‌ని చూస్తున్నావు అని శ్రీ విష్ణు చెప్పే డైలాగ్, అలాగే  చివ‌ర‌లో ‘ప్రకృతికి ఏం తెలుసు ఎవరు మంచోళ్లో, ఎవరో చెడ్డోళ్లో’ అని త‌నికెళ్ల భ‌ర‌ణి చెప్పే డైలాగ్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. అచ్చు రాజ‌మ‌ణి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 శాతం వేతనం డిమాండ్ చేస్తే 22.5 శాతం పెంచారు : కార్మిక శాఖ కమిషన్

5.5 కోట్ల మంది వీసాలను సమీక్షిస్తాం : అమెరికా ప్రకటన

అటెండెన్స్ మినహాయింపు.. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల కోసం దరఖాస్తుల ఆహ్వానం

అందరికీ రెండు లడ్డూలు ఇచ్చారు.. నాకు ఒక్కటే ఇచ్చారు.. సీఎం హెల్ప్ లైన్‌కు ఫిర్యాదు.. ఎక్కడ?

ప్రియురాలితో జరిగిన గొడవ: ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

తర్వాతి కథనం
Show comments